
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఆయన కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోతోంది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడం,సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో బాక్సాఫీస్ కలెక్షన్లు పడిపోతూ వస్తున్నాయి. తొలి రోజు రూ.15 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ.. తర్వాతి రెండు రోజులు అందులో ఐదో వంతు మాత్రమే వసూలు చేసి దారుణంగా దెబ్బకొట్టింది.ఈ సినిమాకు రెండు, మూడు రోజుల్లో మరీ దారుణంగా మూడేసి కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇక ఇప్పుడు మినిమం కలెక్షన్స్ లేక థియేటర్ రెంట్ లు కూడా చాలా చోట్ల రావటం లేదు. చాలా చోట్ల పూర్తి డెఫిషిట్ తో వారం ముగిసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత నష్టపోయింది..ఎంతకు అమ్మారో చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.79 కోట్లు కాగా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి రూ.40 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఈ మొత్తంలో షేర్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ.80 కోట్లకు మరో రూ.55 కోట్ల దూరంలో ఉంది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యమే. ఈ క్రమంలో భోళా శంకర్ డిజాస్టర్ గా మిగిలిపోనుంది. దాదాపు చాలా చోట్లి థియేటర్ రన్ ముగిసినట్లే అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 55 కోట్ల నష్టం వచ్చినట్లు ట్రేడ్ అంచనా వేస్తోంది.
తప్పెవరిది
ఇక భోళాశంకర్ ఫెయిల్యూర్ విషయంలో మెహర్ రమేష్ కన్నా చిరంజీవిదే తప్పు అంటున్నారు. అందుకు కారణం...ఒక రీమేకు తీసేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? డైరక్టర్ దగ్గర నుంచి జబర్దస్త్ టీమ్ ని తీసుకుని వాళ్లను చుట్టు పెట్టుకుని చిరంజీవి అంతటి వాడు చీప్ కామెడీ చేయటం ఏమటి అంటున్నారు. చిరంజీవి సినిమా అనగానే..వందలు, వేలు ఖర్చు పెట్టుకుని ఫామిలీ నో , ఫ్రెండ్స్ నో తీసుకుని థియేటర్ కి వెళితే.. కనీసం సినిమా పూర్తి అయ్యేవరకు సీట్లో కుర్చో పెట్టలేకపోతే.. అని సోషల్ మీడియాలో ఏకిపాస్తున్నారు.