షాకింగ్ డిటేల్స్ : 'జైలర్' ఓవర్ సీస్ ఎంతకు అమ్మారు?..ఎంత వచ్చింది!

Published : Aug 18, 2023, 11:30 AM IST
 షాకింగ్  డిటేల్స్ : 'జైలర్' ఓవర్ సీస్ ఎంతకు అమ్మారు?..ఎంత వచ్చింది!

సారాంశం

రజనీ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఆయన చేసే మేజిక్ కు సరైన కథ పడటం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా


'రోబో 2.0' సినిమా తరువాత రజనీ కొట్టిన పెద్ద హిట్ జైలర్. రోబో కు జైలర్ కు మధ్య చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ప్రతీసారి రజనీకాంత్ కొత్త సినిమా వస్తోందంటే అదిరిపోతుందని ఎక్సపెక్టేషన్స్ పెరగటం  ఆతర్వాత తుస్సుమనటం కామన్ అయ్యిపోయింది.  ఆ మధ్య ఆయన చేసిన 'పెద్దన్న' సినిమా కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా తమిళనాట కూడా తన సత్తా చూపలేకపోయింది. ఇక తెలుగులో కూడా వసూళ్ల పరంగా ఆ సినిమా డీలాపడిపోయింది. 

ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమానే 'జైలర్'. అయితే జైలర్ ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. రిలీజ్ రోజునే ఈ సినిమా తన స్థాయిని చాటుకుంది.    రజనీ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఆయన చేసే మేజిక్ కు సరైన కథ పడటం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ , అక్కడ కలెక్షన్స్ గురించి హాట్ టాపిక్ గా ట్రేడ్ లో మారింది.

అందుతున్న సమాచారం మేరకు జైలర్ ఓవర్ సీస్ రైట్స్ ని 32 కోట్లకు అమ్మారు. ఈ సినిమా ఇప్పటిదాకా ఓవర్ సీస్ లో గ్రాస్ 200+ అని అంచనా. దాంతో అక్కడ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా లాభపడుతున్నారు. జైల‌ర్ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌న కొడుకు మ‌ర‌ణంపై ప్ర‌తీకారం తీర్చుకునే రిటైర్డ్ జైల‌ర్‌గా ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌నపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే