ఆహాలో రిలీజ్ కు రెడీగా బేబి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..?

Published : Aug 18, 2023, 11:50 AM ISTUpdated : Aug 18, 2023, 11:54 AM IST
ఆహాలో రిలీజ్  కు రెడీగా  బేబి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..?

సారాంశం

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది బేబీ సినిమా. ఇక ఈమూవీ డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఓ క్లారిటీ ఇచ్చారు టీమ్.    


చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది బేబీ సినిమా. ఇక ఈమూవీ డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఓ క్లారిటీ ఇచ్చారు టీమ్.  

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ  హీరోగా..  వైష్ణవి చైతన్య,  విరాజ్ అశ్విన్  హీరోయిన్లుగా నటించిన సినిమా బేబీ. కొత్త దర్శకుడు సాయి రాజేశ్  రూపొందించిన  ఈసినిమాను శ్రీనివాస కుమార్  నిర్మించారు. చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బేబీ.. టాలీవుడ్  బాక్సాఫీస్ దగ్గర  అద్భుతమైన సక్సెస్ ను సొంతం చేసుకుంది.  ముగ్గరు మద్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా.. యువతను బాగా ఆకర్షించింది.. ఆడియన్స్ ను  బాగా  ఆకట్టుకుంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా దాదాపు 80 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 

జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది బేబీ..టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసిన ఈసినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. అది కూడా ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా ఎదరు చూస్తున్నారు. . తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై జ్ స్పందించిన టీమ్ అప్‌డేట్ కూడా ఇచ్చారు. బేబీ  మూవీ ప్ర‌ముఖ తెలుగు  ఓటీటీ సంస్థ ఆహాలో రిలీజ్ కాబోతోంది. ఆహాలో ఆగ‌స్ట్ 25న  స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతుంది మూవీ. అంతే కాదు  ఎక్స్‌క్లూజివ్‌గా 12 గంట‌లు ముందుగానే గోల్డ్ స‌బ్ స్క్రైబ‌ర్స్ సినిమా చూసే అవ‌కాశం కల్పిస్తోంది సంస్థ. 

 

టాలీవుడ్ లో తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకెళ్తోంది ఏకైక తెలుగు ఓటీటీ  సంస్థ ఆహా. ఇప్ప‌టికే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను అందించిన ఆహా తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ బేబి మూవీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యింది.  ఈ సినిమా ఆహాలో ఆగ‌స్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే క‌ల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాల పొందిన బేబి సినిమా అతి త్వరలో 100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌టానికి ప‌రుగులు తీస్తోంది.ఇటు తెలుగు, అటు త‌మిళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో కూడా ఈమూవీ రిలీజ్ కాబోతున్నట్టు తెలస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే