సుబ్బిరామిరెడ్డితో చిరు భేటీ!

Published : Aug 22, 2018, 02:23 PM ISTUpdated : Sep 09, 2018, 01:03 PM IST
సుబ్బిరామిరెడ్డితో చిరు భేటీ!

సారాంశం

వ్యాపారవేత్త అయిన టి. సుబ్బారామిరెడ్డికి సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధాలు ఉన్నాయి. కళల పట్ల ఆయనకున్న ఆసక్తితో ప్రతి ఏడాది సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రత్యేకంగా సన్మానిస్తూ అవార్డులు కూడా అందిస్తుంటారాయన

వ్యాపారవేత్త అయిన టి. సుబ్బారామిరెడ్డికి సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధాలు ఉన్నాయి. కళల పట్ల ఆయనకున్న ఆసక్తితో ప్రతి ఏడాది సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రత్యేకంగా సన్మానిస్తూ అవార్డులు కూడా అందిస్తుంటారాయన. అయితే ఇటీవల విదేశాలలో సుబ్బిరామిరెడ్డి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బారామిరెడ్డిని ఆయన స్వగృహంలో మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు.

చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సుబ్బారామిరెడ్డి.  ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రామ్ చరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా చేయాలనేది సుబ్బిరామి రెడ్డి ఆలోచన. దానికి దర్శకుడిగా త్రివిక్రమ్ వ్యవహరిస్తాడనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సంగతి ఓ కొలిక్కి రాలేదు. మరి సుబ్బిరామిరెడ్డి కోరికను మెగాబ్రదర్స్ తీరుస్తారేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ