విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్!

First Published 22, Aug 2018, 1:24 PM IST
Highlights

'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తరువాత విడుదలైన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు

'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తరువాత విడుదలైన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. ఇక తను నటించిన 'గీత గోవిందం' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిజానికి ఈ సినిమా 'పెళ్లి చూపులు' తరువాత అంగీకరించాడు విజయ్ దేవరకొండ. దానికి తగ్గట్లే అతడికి పారితోషికం కూడా అందింది.

'గీత గోవిందం' సినిమాకు అతడు తీసుకున్న రెమ్యునరేషన్ రూ.50 లక్షలు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్ తో తమ రెమ్యునరేషన్ ని ఆరు రెట్లు పెంచేశాడు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న 'నోటా' సినిమాకు గాను అతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాలా రూ.3 కోట్ల రూపాయలు. ఇదే రెమ్యునరేషన్ తన దగ్గరకి వచ్చే నిర్మాతలకు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది.

యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజ్, అతడి పెర్ఫార్మన్స్ కి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు నిర్మాతలు. హీరోగా నటించిన మూడు సినిమాల్లో మూడు విభిన్నమైన రోల్స్ తో తను ఏ పాత్రకైనా సరిపోతానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.   

Last Updated 9, Sep 2018, 1:43 PM IST