అలియాతో పెళ్లిపై రణబీర్ ఏమన్నాడంటే..!

Published : Aug 22, 2018, 12:58 PM ISTUpdated : Sep 09, 2018, 01:43 PM IST
అలియాతో పెళ్లిపై రణబీర్ ఏమన్నాడంటే..!

సారాంశం

బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించిన రణబీర్ కపూర్ ప్రస్తుతం అలియా భట్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా అంగీకరించాడు

బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించిన రణబీర్ కపూర్ ప్రస్తుతం అలియా భట్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా అంగీకరించాడు. ఇరు కుటుంబ సభ్యులు కూడా సన్నిహితంగా మెలుగుతుండడంతో వీరి వివాహం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో ఏకంగా వీరికి పెళ్లి కూడా జరిగిపోయిందని అన్నారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించాడు రణబీర్. ''ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. కానీ కొంత మంది తమ బిజినెస్ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని బయటకి లాగుతున్నారు. ఎవరి వ్యక్తిగత విషయాలైనా.. కొంతవరకు చర్చించవచ్చు కానీ హద్దు దాటకూడదు. అలియాతో పెళ్లి అని వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం నా వయసు 35. ఇది పెళ్లి చేసుకునే వయసే కానీ సిద్ధంగా లేను.

అలియాతో ఉన్న బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు అనేది చెప్పలేను'' అంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం రణబీర్, అలియా ఇద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున వంటి తారలు కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు లో ఈ సినిమా విడుదల కానుంది.   

PREV
click me!

Recommended Stories

10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్