రామమందిరం వేడుకకు వెళ్తున్నా.. చిరంజీవి ప్రకటన.. ఆలయ నిర్మాణం కోసం `హనుమాన్‌` విరాళం..

Published : Jan 07, 2024, 11:41 PM IST
రామమందిరం వేడుకకు వెళ్తున్నా.. చిరంజీవి ప్రకటన.. ఆలయ నిర్మాణం కోసం `హనుమాన్‌` విరాళం..

సారాంశం

రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తమకు ఆహ్వానం అందిందని చిరంజీవి తెలిపారు. అంతేకాదు `హనుమాన్` చిత్ర బృందం విరాళాన్ని ప్రకటించారు.

రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని చిరంజీవి అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం అందిందని, తాము జనవరి 22న జరిగే రాముడి మందిరం ఓపెనింగ్‌ కి వెళ్తున్నామని తెలిపారు. ఆయన తాజాగా `హనుమాన్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు చిరంజీవి. అంతేకాదు `హనుమాన్‌` చిత్ర యూనిట్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. 

రాముడి మందిరం కోసం విరాళం ప్రకటించారు. `హనుమాన్‌` సినిమాకోసం తెగిన ప్రతి టికెట్‌ పై రూ.5 అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం విరాళంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్ర బృందం ఇలాంటి గొప్ప ఆలోచన చేయడం, రాముడి కోసం ఇంత కార్యం చేయడం పట్ల చిరంజీవి ఆనందించారు. ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆ రాముడి ఆశీస్సులు సినిమాకి ఉంటాయన్నారు. 

ఈ సందర్భంగా `హనుమాన్‌` చిత్రం గురించి మాట్లాడారు. ఈ మూవీకి ఈ టైటిల్‌ పెట్టడానికి తనే పరోక్షంగా కారణమని తెలిపారు. తాను సమంతతో చేసిన చాటింగ్‌లో పాల్గొన్నప్పుడు సూపర్‌ హీరోల గురించి ప్రశ్న ఎదురయ్యిందని, ఆ సమయంలో తమకు నచ్చిన సూపర్‌ హీరో `హనుమాన్‌` అని తాను చెప్పినట్టు వెల్లడించారు చిరు. అలా ఆ టైటిల్‌నే ఇప్పుడు ఈ సినిమాకి పెట్టారని తెలిసి చాలా ఆనందించినట్టు తెలిపారు. టీజర్‌, ట్రైలర్‌ నుంచి తనకు సినిమాపై ఆసక్తి ఏర్పడిందని, ఈమూవీ గురించి అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. తాను హనుమంతుడి భక్తుడిగా ఇక్కడికి రావడం తన అదృష్టమని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు