పరీక్షాకాలమే.. `హనుమాన్‌` సినిమాకి థియేటర్ల సమస్యపై మెగాస్టార్‌.. కంటెంట్‌ ఉంటే ఎవ్వరూ ఆపలేరంటూ వ్యాఖ్యలు..

By Aithagoni RajuFirst Published Jan 7, 2024, 10:26 PM IST
Highlights

`హనుమాన్‌` సినిమాకి థియేటర్ల సమస్య నెలకొన్న నేపథ్యంలో తాజాగా చిరంజీవి స్పందించారు. థియేటర్ల సమస్య పై ఆయన ఆచితూచి స్పందించారు. పరీక్షా కాలమే అని చెప్పడం గమనార్హం. 

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన `మనుమాన్‌` చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. మహేష్‌బాబు నటించిన `గుంటూరు కారం`తో పోటీగా ఈ మూవీ రిలీజ్‌ అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ల సమస్య తలెత్తింది. థియేటర్ల దొరకడం లేదని నిర్మాతలు వాపోతున్నారు. పాన్‌ ఇండియా రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో వాయిదా వేసుకోలేని పరిస్థితి. అనేక స్ట్రగుల్స్ మధ్య సినిమాని మహేష్‌తో పోటీగా విడుదల చేస్తున్నారు. థియేటర్లకి సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. 

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన ముఖ్య అతిథిగా `హనుమాన్‌` ఉత్సవ్‌ పేరుతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆయన హనుమాన్‌ గురించి చెప్పుకొచ్చాడు. తాను ఎలా హనుమాన్‌ భక్తుడిని అయ్యాడో తెలిపారు. అదే సమయంలో `హనుమాన్‌` చిత్రానికి థియేటర్ల సమస్యపై కూడా ఆయన స్పందించారు. కంటెంట్ బాగుంటే ఎవ్వరూ ఆపలేరని చిరు పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కంటెంట్‌ ఉన్న సినిమాని మొదటి ఆట, మొదటి షో, మొదటి రోజు ఎక్కువ మంది చూడకపోవచ్చు, ఆ తర్వాత అయినా చూస్తారు? లేట్ గా అయినా ఆదరణ పొందుతుందని తెలిపారు. 

Latest Videos

అయితే ఇది సినిమాకి పరిక్షా కాలమే అని ఆయన అన్నారు. థియేటర్ల సమస్యపై ఆయన ఆచితూచి స్పందించారు. కంటెంట్‌ ఉండి, మన సినిమాలో సత్తా ఉంటే, దైవం ఆశీస్సులు ఉంటే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు, అక్కున చేర్చుకుంటారని తెలిపారు. సంక్రాంతి పండగ అంటే చాలా ముఖ్యమైనదని, అదే సమయంలో ఎక్కువ సినిమాలు ఆడేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్‌ అక్కర్లేదన్నారు. కంటెంట్‌ బాగుంటే లేట్‌గా అయిన మార్కులు పడతాయన్నారు. 

చిన్నవాడైనా తేజ సజ్జా.. సంక్రాంతికి వచ్చే వెంకటేష్‌ సినిమా, నాగార్జున సినిమా, మహేష్‌బాబు సినిమాలు ఆడాలని, వాటితోపాటు తమ సినిమా కూడా ఆడాలన్నారు. చిన్నవాడైనా పెద్ద మనసుతో మాట్లాడటం ఆనందంగా ఉంది. అన్ని సినిమాలు ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి, వాటితోపాటు `హనుమాన్‌` కూడా ఆడాలి. ఇలాంటి పరిస్థితే 2017లో వచ్చింది. అప్పుడు నా `ఖైదీ నెంబర్‌ 150` సినిమా విడుదలవుతుంది. ఆ సమయంలో తమతోపాటు బాలకృష్ణ నటించిన `గౌతమిపుత్ర శాతకర్ణి` రిలీజ్‌ అయ్యింది. మధ్యలో దిల్‌రాజు `శతమానం భవతి` చిత్రాన్ని రిలీజ్‌ చేశాడు. ఈ రెండు సినిమాలు వేయడం ఏంటని దిల్‌రాజుని అడిగాను. పర్వాలేదు సర్‌ సంక్రాంతికి ఆ స్పేస్‌ ఉందని, ఆడతాయని చెప్పాడు. అలానే ఆ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. అలానే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని చెప్పారు. 

దిల్‌రాజు సినిమాల విడుదల విషయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఏ సినిమాకి ఎంత వస్తుంది, ఎలా అడుతుందనేది ఆయనకు బాగా తెలుసు. కచ్చితంగా ఈ మూవీ కూడా అంతటి ఆదరణ లభిస్తుందని, ఆ విషయంలో టెన్షన్‌ అవసరం లేదని, అందరు ధైర్యంగా ఉండాలని తెలిపారు చిరు. ఆ హనుమంతుడి ఆశీస్సులు సినిమాకి ఉంటాయని చిరు వెల్లడించారు.ఈ సందర్భంగా సినిమాకి పనిచేసిన టీమ్‌ని అభినందించారు.సినిమా తీసిన ప్రశాంత్‌ వర్మ, నటించిన తేజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
 

click me!