Sailesh Kolanu : ‘నేను లేపుకొచ్చిన అమ్మాయిని వైజాగ్ కే తీసుకొచ్చా’.. సీక్రెట్ రివీల్ చేసిన శైలేష్ కొలను

Published : Jan 07, 2024, 10:30 PM IST
Sailesh Kolanu : ‘నేను లేపుకొచ్చిన అమ్మాయిని వైజాగ్ కే తీసుకొచ్చా’.. సీక్రెట్ రివీల్ చేసిన శైలేష్ కొలను

సారాంశం

‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సైలేష్ కొలను తన లవ్ స్టోరీ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. వైజాగ్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పే క్రమంలో లవ్ స్టోరీని కాస్తా రిలీల్ చేశారు.   

విక్టరీ వెంకటేశ్- సైలేష్ కొలను కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సైంధవ్’ Saindhav. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో గ్రాండ్ గా జరుగుతోంది. వెంకీ, నవాజుద్దీన్, హీరోయిన్ల ఎంట్రీతో పాటు ఫ్యాన్స్ రావడంతో ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్  డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం Venkatesh  యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’ Saindhav మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ మామను సైలేష్ కొలను ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపించారు.  

ఈ చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకుంటోంది. సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. పైగా ఈ చిత్రం వెంకీ కెరీర్ లో 75వ చిత్రం కావడం విశేషం. దాంతో సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ వెంకటేశ్ మాస్ అండ్ యాక్షన్ తో రాబోతుండటంతో ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. 

ఈరోజు సైంధవ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని RK బీచ్ లో గ్రాండ్ గా జరుగుతోంది. గోకుల్ పార్క్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దిఖ్, డైరెక్టర్ సైలేష్ కొలను, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకీ అభిమానులు సహా సైంధవ్‌ చిత్రయూనిట్ అంతా హాజరైంది. దీంతో వెంకీ మామ అభిమానులు, వైజాగ్ ప్రజలు భారీగా ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ప్రాంగణమంతా సందడి సందడిగా మారింది. 

వేదికపై డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన లవ్ స్టోరీ గురించి కాస్తా చెప్పే ప్రయత్నం చేశారు... ఆయన మాట్లాడుతూ... వైజాగ్ తో తనకు బాగా అనుబంధం ఉందన్నారు. డిగ్రీ చేస్తున్న సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ ను వైజాగ్ కే తీసుకొచ్చానని చెప్పారు. వైజాగ్ వల్ల ఆ అమ్మాయినే పెళ్లిచేసుకున్నానని చెప్పుకొచ్చారు. వైజాగ్ కల్చర్ నచ్చి మళ్లీ  ‘సైంధవ్’ ఈవెంట్ ఇక్కడే పెట్టామన్నారు. బ్యూటీఫుల్, హానెస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు.  

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే