#Balakrishna:బాలయ్య ఫ్యాన్స్ తక్కువవాళ్లా, ఓ రేంజిలో రచ్చ మొదలు

By Surya PrakashFirst Published Sep 20, 2022, 4:11 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏం చేసినా స్పెషలే . ఇప్పుడు ఆ విషయం మరో సారి ప్రూవ్ కాబోతోంది. ఆయన సూపర్ హిట్ చిత్రం చెన్నకేశవరెడ్డి   యుఎస్ లోనూ  ఇక్కడ కూడా ఈ సినిమా స్పెషల్ షోలు భారీ లేవల్లోనే ఉండనున్నాయి.  


 బాలయ్య సినిమాల్లో వివి వినాయక్ డైరెక్ట్ చేసిన చెన్నకేశవ రెడ్డి సినిమా ఒకటి.ఈ సినిమా అప్పట్లో హిట్ అనిపించుకున్నా ...ఆ తర్వాత మిగతా మీడియాల్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది.  బాలయ్య సినిమాల్లో కల్ట్ క్లాసికల్ గా మిగిలి పోయింది. ఎంతలా అంటే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికి అభిమానులు చూస్తూంటారు. అంతలా గుర్తుండి పోయాయి.ఆ  రేంజిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు బాలయ్య వంతు రావడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఆ తరుణం కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను యూఎస్ లో 30 కి పైగానే స్పెషల్ షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్పెషల్ షో సెప్టెంబర్ 24, 25 న ఉండబోతున్నాయ .ఇక యుఎస్ లోనే కాకుండా ఇక్కడ కూడా ఈ సినిమా స్పెషల్ షోలు భారీ లేవల్లోనే ఉండనున్నాయి.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.

ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో 108వ సినిమాకు ఓకే చెప్పాడు.

click me!