
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈసినిమాకు ఇండియన్ ఆడియన్స్ ప్రతీ భాషలో బ్రహ్మరధం పట్టారు. భారీ అంచనాల మధ్య పోయిన ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఒక రకంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. అసలు అప్పటి వరకూ హిందీ లో ఒక్క సినిమా కూడా చేయని బన్నీ.. ఈసినిమాతో ఫస్ట్ టైమ్ నార్త్ ఆడియన్స్ ను కూడా పలకరించాడు. హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
పుష్ప సినిమాకు పోటీగా బాలీవుడ్ లో సీనియర్ హీరోలు పోటీకి దిగినా.. ఈసినిమాకు పోటీ ఇవ్వలేకపోయారు. మరో వైపు పుష్పకు పోటీగా స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్ లాంటి హాలీవడ్ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. కాని పుష్పరాజ్ ధాటికి వాటి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సుకుమార్ టేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్, మేనరిజంలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి గతేడాది ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే చాలా అవార్డ్ లు గెలుచుకుంది ఈ సినిమా రీసెంట్ గా సైమా అవార్డ్ లలో ఆరు అవార్డ్ లు సాధించి సత్తా చాటింది. కాగాప్రస్తుతం పుష్ప మరో అరుదైన ఘనతనుసాధించింది. మాస్కోలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో, ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల విభాగంలో ఈ ఏడాది పుష్ప ఎంపికైంది. ఇక పుష్ప రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ జోడీగా.. ఆయనకు ధీటుగా నటించింది కన్నడ కస్తూరి రష్మిక మందన్నా. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ సీక్వెల్ పుష్ప2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది పుష్ప సీక్వెల్ మూవీ షూటింగ్.