400 చిత్రాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ దుస్థితి... ప్రాణాంతక వ్యాధికి డబ్బులేక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స!

By Sambi ReddyFirst Published Sep 20, 2022, 2:07 PM IST
Highlights

జయకుమారి ప్రస్తుత జీవితం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆమెకు కనీసం సొంత ఇల్లు లేదు. రూ. 750 అద్దెకు ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటుంది. వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం క్షీణించింది. ఆమె కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 

గతమెంతో ఘనం ప్రస్తుత జీవితం దుర్భరం. సినిమా అనే రంగుల ప్రపంచంలో చీకటి కోణాలెన్నో ఉంటాయి. తారలుగా వెండితెరను ఏలిన కొందరు నటుల చివరి రోజులు దారుణంగా ముగుస్తాయి. మహానటి సావిత్రికే ఈ దుస్థితి తప్పలేదు. కాంతారావు, పద్మనాభంతో పాటు అనేక మంది సీనియర్ స్టార్స్ చివరి రోజుల్లో పేదరికాన్ని అనుభవించారు. అలాంటి వారి లిస్ట్ లో తాజాగా నటి జయకుమారి చేరారు. 70వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన జయకుమారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందల చిత్రాలు చేశారు. స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల చేత ఆరాధింపబడ్డారు. 

అంతటి ఘన కీర్తి ఉన్న జయకుమారి ప్రస్తుత జీవితం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆమెకు కనీసం సొంత ఇల్లు లేదు. రూ. 750 అద్దెకు ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటుంది. వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం క్షీణించింది. ఆమె కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఖరీదైన చికిత్సకు డబ్బుల్లేక చెన్నైలోని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వార్త మీడియాలో రావడంతో మంత్రి ఎమ్. సుబ్రహ్మణ్యన్ ఆమెను కలిశారు. 

ప్రభుత్వ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జయకుమారికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే వైద్య సహాయంతో పాటు సొంత ఇల్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీన స్థితిలో ఉన్న మీనాకుమారి పట్ల ప్రభుత్వం చూపిన శ్రద్ధకు జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయకుమారికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు. ఇక అబ్బాయి. మరి వీరు ఎక్కడ ఉన్నారు? వారు తల్లి బాధ్యత ఎందుకు తీసుకోలేదనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులోబాల మిత్రుల కథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, కల్యాణ మండపం వంటి చిత్రాల్లో నటించారు. 
 

click me!