తన కోరిక తీర్చమని వేధిస్తున్నాడు.. సీనియర్ నటి ఆవేదన!

Published : Oct 01, 2018, 04:08 PM IST
తన కోరిక తీర్చమని వేధిస్తున్నాడు.. సీనియర్ నటి ఆవేదన!

సారాంశం

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోతోందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగు నటి శ్రీరెడ్డి ఈ విషయంలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోతోందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగు నటి శ్రీరెడ్డి ఈ విషయంలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో తనుశ్రీదత్తా పలువురు తారలు తనను లైంగికంగా వేధించారంటూ బయటకి వచ్చి కామెంట్లు చేస్తోంది. 

తాజాగా సీనియర్ నటి గాయత్రి సాయి ఓ జర్నలిస్ట్ తనను వేధిస్తున్నాడని, లొంగకపోతే పరువు తీస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఎనిమిది నిమిషాల నిడివి గల ఓ వీడియో క్లిప్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఆమె.. ఎం.స్వామి అనే జర్నలిస్ట్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, రెండేళ్లుగా సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వేధిస్తున్నాడని కన్నీటి పర్యంతమవుతూ చెప్పుకొచ్చింది.

2016లో హాంకాంగ్ లో తన భర్త చనిపోయిన తరువాత తొలిసారి స్వామి తనను కలిశాడని, తన  కొడుకు పాస్ పోర్ట్ విషయంలో సహాయం చేస్తానని పరిచయం చేసుకోవడంతో అతడితో టచ్ లో ఉన్నట్లు వెల్లడించింది. అయితే అతడి ప్రవర్తనలో తేడా కనిపించడంతో దూరం పెట్టినట్లు.. అతడు మాత్రం తన ఇంటి సమీపంలోనే ఇంటిని తీసుకొని తనను వేధించడం మొదలుపెట్టాడని స్పష్టం చేసింది.

తనను శారీరకంగా తాకుతూ.. కోరిక తీర్చమని అడుగుతున్నాడని ఆరోపణలు చేసింది. సదరు జర్నలిస్ట్ మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపడేశాడు. ఆమెకి వ్యతిరేకంగా తానో స్టోరీ సిద్ధం చేస్తున్నానని.. ఈ విషయం తెలిసే ఆమె తనపై ఆరోపణలు చేస్తుందని వివరించాడు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?