అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?

By Prashanth M  |  First Published Oct 1, 2018, 3:41 PM IST

*ఫ్యాక్షనే కానీ..  రొటీన్ కు కాస్త బిన్నంగా

*కథలో లీనమయ్యే మాటలు 

*మహిళల ఆవేదన 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. అజ్ఞాతవాసి సినిమాతో ఫ్లాప్ అందుకున్న త్రివిక్రమ్ ఈ సారి తప్పకుండా మెప్పిస్తాడని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 

ఇకపోతే సినిమా అసలు కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. రెండు గ్రూపుల మధ్య జరిగే ఫ్యాక్షనిజం గురించి అందరికి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఫ్యాక్షన్ వల్ల బాధపడే మహిళలు మనోవేదనను మెయిన్ గా చూపించనున్నాడట. ఇద్దరు లీడర్ల మధ్య జరిగే గొడవల కోరణంగా ఎంతో మంది మహిళలు వారి భర్తలను, సోదరులను కోల్పోతుంటారు. అదే త్రివిక్రమ్ ప్రధాన అంశంగా తీసుకొని బావోద్వేగమైన కథను నడిపించాడట. 

Latest Videos

ప్రధానంగా డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సన్నివేశాలకు అనుగుణంగా కథలో లీనమైన మాటలు చాలా బావుంటాయని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. మరి ఈ సారి త్రివిక్రమ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూడాలి. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ కానుంది.         

click me!