లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయిన కూతురి కోసం ఏడ్చాను: రాజేంద్రప్రసాద్

By Udayavani DhuliFirst Published Oct 1, 2018, 1:53 PM IST
Highlights

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 'ఆ నలుగురు','మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాల్లో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'బేవర్స్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 'ఆ నలుగురు','మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాల్లో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'బేవర్స్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ ఎన్నడూలేని విధంగా చాలా ఎమోషనల్ అయ్యారు.

తన వ్యక్తిగత విషయాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ''తల్లి లేనివాడు తన కూతురిలో తల్లిని చూసుకోవాలనుకుంటాడు. నా తల్లి నాకు పదేళ్ల వయసులోనే చనిపోయింది. నాకు ఒక్కర్తే కూతురు. తన పేరు గాయత్రి. ఆమెతో నేను మాట్లాడను. ఎందుకంటే తను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయింది.

ఈ సినిమాలో సుద్దాల అశోక్ తేజ్ రాసిన 'తల్లీ తల్లి నా చిట్టితల్లి' అనే పాట విన్నప్పుడు మాత్రం నా కూతురిని ఇంటికి పిలిపించి ఆ పాటను నాలుగైదు సార్లు ఆ పాట వినిపించాను. నా తల్లి చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. కానీ నా కూతురు వెళ్లిపోయినప్పుడు మాత్రం ఏడ్చాను.

ఈ పాటను నేను ఎప్పటికి మర్చిపోలేను. మీకు మనసుంటే జన్మలో ఈ పాటను మర్చిపోలేరు. బేవర్స్ ఈ టైటిల్ ఏంటి..? అనుకుంటారు కానీ.. పేరెంట్స్ ని అర్ధం చేసుకోలేని పిల్లలే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్ధం చేసుకోలేని తల్లితండ్రులు కూడా బేవర్సే..'' అని వెల్లడించారు. 
   

click me!