Bigg boss telugu 5: లోపల ఉన్న ప్రియుడు షన్నును తిడితే, బయటున్న దీప్తికి మండింది...!

Published : Nov 14, 2021, 03:57 PM IST
Bigg boss telugu 5: లోపల ఉన్న ప్రియుడు షన్నును తిడితే, బయటున్న దీప్తికి మండింది...!

సారాంశం

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్- సన్నీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరినొకరు దూషించుకోగా,  ఈ వివాదం తారాస్థాయికి చేరింది. కాగా ప్రియుడు షణ్ముఖ్ పై గొడవ పడ్డ సన్నీ పై ఫైర్ అయ్యింది, దీప్తి సునైన.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా టవర్ లో పవర్ ఉంది అనే గేమ్ నిర్వహించడం జరిగింది. ఈ గేమ్ లో సన్నీని పట్టుకున్న సిరిపై అతడు ఫైర్ అయ్యాడు. మళ్ళీ నేను గేమ్ లోకి వస్తే తంతా, నేను మీద పడితే అప్పడం అయిపోతావ్, అని సిరిని ఉద్దేశించి సన్నీ కామెంట్స్ చేశారు. ఈ గొడవలో సిరికి మద్దతుగా వచ్చిన షణ్ముఖ్, సన్నీ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు దూషించుకున్నారు. నిన్న శనివారం కావడంతో నాగార్జున (Nagarjuna) షోకి వచ్చారు. ఈ గొడవలో సన్నీదే తప్పు అన్నట్లు, ఆయనతో పాటు కంటెస్టెంట్స్ తేల్చారు. 


గొడవ సమయంలో షణ్ముఖ్ (Shanmukh) ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని ఆడుతున్నాడని, అతడి సత్తా యూట్యూబ్ వరకే అన్నట్లు అర్థం వచ్చేలా సన్నీ కామెంట్స్ చేశాడు. ఈ పదాలను ఉద్దేశిస్తూ సన్నీపై షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునైన ఫైర్ అయ్యింది. గేమ్ ఆడడం అంటే గట్టిగా అరుస్తూ... కొట్లాటకు దిగడం కాదని, మైండ్ గేమ్ ఆడాలని, అది షణ్ముఖ్ ఎంతో గొప్పగా ఆడుతున్నడని అన్నారు. సిరి సప్పోర్ట్ తీసుకున్నంత మాత్రాన ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని ఆడినట్లు కాదని, అలా అయితే కాజల్, ప్రియాంక కూడా తనకు మద్దతు ఇస్తున్నారని దీప్తి అన్నారు. 


అదే సమయంలో మనకు అవమానం జరిగినప్పుడు కూడా సహనంగా ఉండడమే నిజమైన బలం, అది షణ్ముఖ్ దగ్గర ఉంది. షణ్ముఖ్ నువ్వు గేమ్ ఆడు, నీ కోసం నేను ఉన్నాను అంటూ మరో కామెంట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా దీప్తి (Deepthi sunaina).. ఈ తరహా పోస్ట్స్ చేయడం జరిగింది. షణ్ముఖ్ ని బిగ్ బాస్ సీజన్ 5(Bigg boss telugu 5) టైటిల్ విన్నర్ గా చూడాలని, ఆమె చాలా ఆత్రుత పడుతున్నారు. దాని కోసం గట్టిగా క్యాంపైన్ చేస్తున్నారు. 

Also read Jessi Eliminated: బిగ్‌బాస్‌ 5హౌజ్‌లో పెద్ద ట్విస్ట్ .. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే.. వాళ్లంతా రిలాక్స్..
ఫైనల్ కి వెళ్లే కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ ఒకరని చాలా మంది అభిప్రాయం. అతడు టైటిల్ కూడా గెలుచుకునే అవకాశం కలదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా నేడు ఎలిమినేషన్స్ లో ఉన్న నలుగురు సేఫ్ అని సమాచారం. నిన్న సన్నీ సేవ్ కాగా... రవి, సిరి, మానస్, కాజల్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే అనారోగ్యం కారణంగా గేమ్ నుండి సీక్రెట్ రూమ్ కి వెళ్లిన జెస్సీని ఈ వారం హౌస్ నుండి బయటికి పంపిస్తున్నట్లు సమాచారం ఉంది. 

Also read Bigg Boss Telugu 5: సన్నీని దోషిగా తేల్చిన సభ్యులు.. కానీ సన్నీ ధైర్యాన్ని ప్రశంసించిన నాగ్‌.. ఇదేం ట్విస్ట్

PREV
click me!

Recommended Stories

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?