హిందీ "ఛ‌త్ర‌ప‌తి" ట్రైలర్...తెలుగు వెర్షన్ కు తేడా ఆ ఒక్కటే

Published : May 02, 2023, 05:07 PM IST
 హిందీ  "ఛ‌త్ర‌ప‌తి" ట్రైలర్...తెలుగు వెర్షన్ కు తేడా ఆ ఒక్కటే

సారాంశం

ఈ సినిమాలో కూడా ఆ సీన్సే కీలకం కానున్నాయి. తెలుగులో కనెక్ట్ అయిన  ఎమోషన్ కనుక అక్కడ కూడా వర్క్ అవుట్ అయితే.. ఈ సినిమా కూడా విజయం సాధించడం పక్కా


  ప్రభాస్ బ్లాక్ బస్టర్  "ఛ‌త్ర‌ప‌తి" సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరక్టర్  వి వి వినాయక్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్లకు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.  మే 12, 2023న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.  ఈ ట్రైలర్ ను పూర్తిగా యాక్షన్ సీన్స్ తో నింపేశారు. 

 తెలుగు ఛత్రపతిలో హీరో కుటుంబం శ్రీలంక నుంచి ఇండియాకు కాందిశీకులుగా వచ్చినట్లుగా చూపించగా.. హిందీ రీమేక్ లో మాత్రం పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చూపించారు.  ఈ పాయింట్ తప్పించి  మిగతాదంతా యాటజీట్ దింపేసారని చెప్పొచ్చు. తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో ఛత్రపతిని ఎంత స్ట్రాంగ్ గా  చూపించారో.. హిందీలోనూ అలాగే చూపించారు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ బాడీని కూడా బాగా పెంచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ట్రైలర్ క్లియర్ గా కనపడుతోంది.

ప్రభాస్ ఛత్రపతిలో ఎమోషనల్ సీన్స్  ఓ రేంజిలో  లో ఉంటాయి.  ఈ సినిమాలో కూడా ఆ సీన్సే కీలకం కానున్నాయి. తెలుగులో కనెక్ట్ అయిన  ఎమోషన్ కనుక అక్కడ కూడా వర్క్ అవుట్ అయితే.. ఈ సినిమా కూడా విజయం సాధించడం పక్కా.  హిందీ  ఛత్రపతిలో బాలీవుడ్ లెజెండ‌రీ క‌మెడియ‌న్ జానీ లివ‌ర్ (Johny Lever) కీ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై బాలీవుడ్ నిర్మాత జ‌యంతి లాల్ గ‌డా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ భామ నుస్రత్‌ బరూచా ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ, శరద్ కేల్కర్‌, శివమ్‌ పాటిల్‌, ఫ్రెడ్డి దారువాలా, రాజేంద్ర గుప్తా, సహిల్‌ వైద్‌ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తనిష్క్‌ బాఘ్‌చీ సంగీతం అందిస్తున్నాడు.  మంగళవారం (మే 2) ముంబైలో ఈ ట్రైలర్ లాంఛ్ ఘనంగా జరిగింది. దీనికి మూవీ యూనిట్ మొత్తం హాజరైంది. తెలుగు ఛత్రపతికి  సంగీతం పెద్ద ప్లస్ అయింది. అయితే హిందీలో ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే అదే కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?