బాలయ్య సీక్రెట్ చార్మి అలా బయట పెట్టేసిందేంటి

Published : Aug 28, 2017, 12:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
బాలయ్య సీక్రెట్ చార్మి అలా బయట పెట్టేసిందేంటి

సారాంశం

పైసా వసూల్ ఆడియో సక్సెస్ మీట్ వేడుకలకు చార్మి బాలకృష్ణ హీరోగా పూరీ జగన్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసావసూల్ వేడుకలో బాలకృష్ణకు సంబంధించిన సీక్రెట్ ఓపెన్ చేసిన చార్మి  

బాలకృష్ణ అభిమానులు తమ హీరోను బాలయ్యబాబు, నందమూరి నట సింహం అన్న పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అయితే బాలకృష్ణకు తన అభిమానులు తనను ముద్దుగా పిలిచే ఆ ముద్దుపేరు నచ్చవట. బాలకృష్ణ ఎంతగానో ఇష్టపడే మరొక ముద్దుపేరును బయట పెట్టింది ఛార్మీ. 

 

ఆ ముద్దు పేరు గురించి చార్మి అలా చెబుతుంటే బాలయ్య తెగ ఆనందపడిపోతు మధ్యలో చార్మిని దగ్గరకు తీసుకుని అభినందించిన సీన్స్ చూసి ఆ ఆడియో సక్సస్ మీట్ కు వచ్చిన చాలామంది ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ తాతగా మారినా ఇంకా బాలయ్యలోని ఆ చిలిపి కృష్ణుడు ఇంకా హడావిడి చేస్తూనే ఉన్నాడంటున్నారు కొందరు.

 

‘పైసా వసూల్’ ఆడియో సక్సస్ మీట్ లో ఛార్మీ ఈ కామెంట్స్ చేసింది. ఈ విషయాన్ని లీక్ చేస్తూ ఛార్మీ వయ్యారాలు పోతూ చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. బాలకృష్ణకు తన హీరోయిన్స్ చేత ‘బాల’ అని పిలిపించుకోవడం ఇష్టమట. 

 

ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీకి ఇవాల్టి నుంచి భారీ పబ్లిసిటీ ఇచ్చి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తీసుకురావడానికి పూరి జగన్నాథ్ మాష్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. యూత్ ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా