బిగ్ బాస్ షో- అనూహ్యాంగా సేఫ్ జోన్ లోకి అర్చన, కార్తిక ఔట్

Published : Aug 28, 2017, 11:59 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బిగ్ బాస్ షో- అనూహ్యాంగా సేఫ్ జోన్ లోకి అర్చన, కార్తిక ఔట్

సారాంశం

బిగ్ బాస్ హౌజ్ లోంచి అనూహ్యంగా కార్తిక ఔట్ అంత మంచి తనం పనికిరాదంటూ కార్తికను పంపించేసిన బిగ్ బాస్ మిరపకాయలా వుండే అర్చన సేఫ్ జోన్ లోకి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మీద రోజురోజుకు ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో వారం వారం వినూత్న పద్దతిలో సర్ ప్రైజ్ చేస్తుండగా వారానికి ఒకరిద్దరిని ఎలిమినేట్ చేస్తూ ఫైనల్ గా ఎవరు ఈ రియాలిటీ షో గెలుస్తారు అన్న ఆలోచన మొదలయ్యేలా చేస్తున్నారు. ఇప్పటివరకు హౌజ్ లో చిన్న చిన్న గొడవలతోనే నడుస్తుంది.

 

అంతేకాదు ఇప్పటిదాకా హౌజ్ మెట్స్ లోని లోపాలను చూపిస్తూ నామినేట్ చేశారు. కాని ఇప్పుడు మిగిలిన ఈ 8 మందిలో బయటకు కనిపించేలా ఏ ఇబ్బంది లేదు. సో ఇప్పుడు పోటీగా ఉన్న కంటెస్టంట్ ను బయటకు పంపాలని అనుకుంటారు. ఇక ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ధన్ రాజ్ శనివారం ఎలిమినేట్ అయ్యాడని ఎనౌన్స్ చేయగా ఆదివారం కార్తికను ఎలిమినేట్ చేశారు. అర్చన, కార్తికలో ఫైనల్ గా కార్తికను బయటకు పంపేశారు. అందరితో మంచిగా ఉన్న కార్తిక ఈ గేంకు సరితూగదు అని ఆడియెన్స్ ఆమెను ఎలిమినేట్ చేశారు. ఇక మిరపకాయలా ఎప్పుడూ హాట్ హాట్ గా వుండే అర్చన.. మరోసారి సేఫ్ అయ్యింది. ఇక మిగిలిన 8 మందిలో తర్వాత వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది చూడాలి.

 

ఇక ఎప్పటిలానే ఎన్టీఆర్  తన జోష్ ఫుల్ యాంకరింగ్ తో ఈ వీకెండ్ షోలు కూడా అదరగొట్టేశాడు. ఇప్పటికి 40 రోజులు ముగించుకున్న బిగ్ బాస్ రానున్న 30 రోజుల్లో ఎలాంటి వినోదం పంచనుంది.. హౌజ్ మేట్స్ కేరక్టర్స్ అసలు రంగు ఎలా బయటపడుతతుంది అనేది ఎక్సయిటింగ్ గా మారనుంది.

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?