చంద్రయాన్‌-3 పై సినిమా, రాజమౌళి డైరెక్టర్....? ఆ బాలీవుడ్ స్టార్ ను హీరోగా డిమాండ్ చేస్తున్ననెటిజన్లు..?

Published : Aug 25, 2023, 01:20 PM ISTUpdated : Aug 25, 2023, 03:16 PM IST
చంద్రయాన్‌-3 పై సినిమా,  రాజమౌళి డైరెక్టర్....? ఆ బాలీవుడ్ స్టార్ ను హీరోగా  డిమాండ్ చేస్తున్ననెటిజన్లు..?

సారాంశం

చంద్రయాన్3 తో భారత్ సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా.. భారత్ పేరు మారుమోగిపోయింది. ఈక్రమంలో చంద్రయాన్ 3 ని బయోపిక్ మూవీగా తీయా3లన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తుంది.   

చంద్రమండలంపై  మన జాతీయ జెండా ఎగిరింది. ప్రతీ ఒక్క భారతీయుడు గర్వించదగ్గ క్షణంలో.. ప్రపంచం అంతా ఇండియా సాధించిన ఘనత గురించి గొప్పగా కీర్తించింది. చంద్రమండలంపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా.. చంద్రమండలం దక్షణ భాగంలో దిగిన మొదటి దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈక్రమంలో ఈ విజయాన్ని ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ కు సబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది. నెటిజన్ల నుంచి ఓ డిమాండ్ కూడా బయటకు వస్తోంది. 

ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు బయోపిక్ మూవీస్ గా తెరకెక్కి.. సినీప్రియులను అలరించాయి. ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. యదార్ధ సంఘటనలతో వందల సినిమాలు తెరకెక్కాయి. ఇక ఇప్పుడు భారత శాస్త్రవేత్తల బృందం సాధించిన ఈ విజయాన్ని సినిమాగా మలిచాలనే డిమాండ్ బయటకు వినిపిస్తోంది. ఈకథతో బయోపిక్ మూవీ తెరకెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. 
అంతే కాదు ఈసినిమాను దర్శకధీరుడు.. ఇండియన్ సినిమాను ప్రపంచం మెచ్చేలా చేసిన రాజమౌళి డైరెక్ట్ చేస్తే చూడాలని ఉంది అంటూ డిమాండ్ వినిపిస్తోంది. 

ఇక ఈ డిమాండ్ బాలీవుడ్ ఆడియన్స్ నుంచి వస్తుండటంతో.. ఈసినిమాలో హీరోగా ఎవరు నటించాలి అనే విషయంలో కూడా సోషల్ మీడియా జనాలు ఒకే మాటమీద ఉన్నారు. ఇక ఇలాంటి సినిమాల చేయాలంటే గుర్తుకు వచ్చే ఏకైక హీరో అక్షయ్ కుమార్. ఆయన ఇప్పటికే ఇలాంటి సినిమాలు చేసి ఉన్నారు. బయోపిక్ మూవీస్.. ఎక్స్ పెర్మెంటల్ మూవీస్ చేయాలి అంటే అక్షయ్ తరువాతే ఎవరైనా.. ఈక్రమంలో అక్షయ్ కుమార్ ఈసినిమా చేస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు. మిషన్ మంగల్, రామసేతు, ఓమైగాడ్, కేసరి లాంటి ప్రయోగాత్మక సినిమాలతో అక్షయ్ అదరగొట్టారు. ఇక ఈమూవీని అక్షయ్ ,చేస్తేనే బాగుంటుంది అంటున్నారు ప్రేక్షకులు. 

చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 3 విజయం వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఇస్రో శాస్ర్తవేత్తలు ఎలా అధిగామించారో తెలుపుతూ.. ఒక సినిమాగా తీసి భారతీయులకు చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఆసక్తికర సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అని చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు నెటిజన్లు కూడా చంద్రయాన్ 3 బమోపిక్ తీయమని డిమాండ్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు