తారకరత్న పెద్దకర్మ: సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు.. కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఓదార్పు..

Published : Mar 02, 2023, 04:21 PM IST
తారకరత్న పెద్దకర్మ: సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు.. కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఓదార్పు..

సారాంశం

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో తారకతర్న పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరై తారకరత్నకు నివాళులర్పించారు. 

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో తారకతర్న పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరై తారకరత్నకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..తారకరత్న చిత్రపటం వద్ద  శ్రద్ధాంజలి ఘటించారు. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణను పరామర్శించారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో కూడా చంద్రబాబు మాట్లాడారు.

తారకరత్న కూతురు నిషికతో కూడా చంద్రబాబు ముచ్చటించారు. ఇంకా ఈ  కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ దంపతులు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. తారకరత్నకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. విజయసాయిరెడ్డి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి  బాబాయి అవుతారనే సంగతి తెలిసిందే. తారకరత్న కుటుంబం నుంచి బాలకృష్ణ, అలేఖ్య రెడ్డి తరఫు నుంచి విజయసాయి రెడ్డి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

 

 


ఇక, ఇక, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ  చికిత్స పొందుతూ తారకరత్న ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?