‘చలో చలో’ అంటున్న ‘విరాట పర్వం’.. సాలిడ్ గా వారియర్ వీడియో సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్..

Published : Jun 12, 2022, 07:06 PM ISTUpdated : Jun 12, 2022, 07:10 PM IST
‘చలో చలో’ అంటున్న ‘విరాట పర్వం’.. సాలిడ్ గా వారియర్ వీడియో సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్..

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘విరాట పర్వం’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో సాలిడ్ సాంగ్ ను రిలీజ్ చేశారు.   

దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం'. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలె చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించిన చిత్ర  యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.  మూడేండ్ల కిందనే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేళలకు ఈ చిత్రాన్ని ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 1990లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం చుట్టూ కథాంశం తిరగనున్నది. నీది నాది ఒకే కథ' చిత్రంతో తన సత్తా చూపించిన వేణు ఊడుగుల విరాటపర్వం కథని చాలా బలంగా రాశారని ట్రైలర్స్, సాంగ్స్ చూస్తే తెలుస్తోంది.  

ఇప్పటికే ఈ చిత్రం  నుంచి  రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను  ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల మూడు సాంగ్స్ ‘కోలు కోలు’, ‘వీర తెలంగాణ’, ‘నగాదారిలో’ రిలీజ్ అయి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కాగా తాజాగా మరో సాలిడ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘చలో చలో’ అనే టైటిల్ తో  ది వారియర్ సాంగ్ అంటూ విడుదల చేశారు. ఈ విప్లవ పాటకు జిలుకర శ్రీనివాస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. సింగ్ సురేశ్ బొబ్బిలి చక్కగా పాడారు. అయితే పేదలు, ఆడబిడ్డలు, బడుగులకు ధైర్యమిచ్చేలా రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నారు. అందుకు తగట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి క్యాచీ ట్యూన్ అందించారు. ప్రస్తతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

అన్ని అడ్డంకులను, సమస్యలను అధిగమించి ఎట్టకేళలకు ‘విరాట పర్వం’ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు