sukrithi Engagement: గ్రాండ్ గా కేరింత నటి నిశ్చితార్థం, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సుకృతి

Published : Jun 12, 2022, 05:26 PM ISTUpdated : Jun 12, 2022, 05:36 PM IST
sukrithi Engagement: గ్రాండ్ గా కేరింత నటి నిశ్చితార్థం, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సుకృతి

సారాంశం

కేరింత నటి ఓ ఇంటి కోడలు అవ్వబోతోంది. భావన క్యారెక్టర్ లో జీవించిన హీరోయిన్ సుకృతి త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. రీసెంట్ గా నిశ్చితార్ధం చేసుకుంది. 

సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన కేరింత  సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీ దివ్య మెయిన్ హీరోయిన్ అయినా.. మరోనటి సుకృతి తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. సుకృతి పేరు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ఆ సినిమాలో భావన అనే పాత్ర అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. భావన పాత్ర కేరింత సినిమాకే ప్లస్ అయింది.ఈ చిత్రంలో హీరోయిన్‌కు స‌మానంగా ఉండే మ‌రో పాత్ర‌ భావ‌న. భావ‌న రోల్‌లో సుకృతి న‌టించింది. నిజానికి హీరోయిన్ క‌న్నా ఎక్క‌వ నిడివి గ‌ల పాత్ర ఈమెది. ఈ ఒక్క సినిమాతోనే యూత్‌ను క‌ళ్ళుతిప్పుకోకుండా చేసింది. 

ఈ సినిమాలో త‌న న‌ట‌న‌, క్యూట్ ఎక్స్‌ప్రేష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈమె సినిమాల‌ను దూరంగా ఉంటుంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది సుకృతి.  ఇన్స్టాగ్రామ్‌లో ఎప్పటిక‌ప్పుడు ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ప‌ల‌కరిస్తుంది.ఆ తర్వాత ఆమె తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్దగా సినిమాలు చేయలేదు.

అయితే ఆమెకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సుకృతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ నటులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి. 

 

అంతే కాదు ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోలను ఈ జంట త‌మ త‌మ‌ ఇన్స్టా పేజ్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సుకృతి ఇన్స్టాగ్రామ్‌లో ‘నా ప్రపంచం నాన్న‌. భ‌య‌ప‌డిన‌ప్పుడు నా భుజం తడుతూ, న‌న్ను సంతోష‌ప‌రుస్తూ, నా చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నాడు. ఎప్పుడు ఉత్త‌మ నాన్న‌లాగే ప్ర‌వ‌ర్తించాడు. ఐదేళ్ళ క్రీతం అమ్మ చ‌నిపోయింది. అప్ప‌టి నుండి అమ్మ ప్రేమ‌ను సైతం తానే అందించాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బ‌ల‌మైన వ్య‌క్తివి నువ్వే నాన్న‌.. ఎప్ప‌టికీ నువ్వే నా ఫ‌స్ట్ ల‌వ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?