
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ(Bigg Boss Telugu Ott)లో అసలైన రచ్చ ప్రారంభమైంది. బిగ్‌బాస్ షో ఈ సారి ఓటీటీలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ రియాలిటీ షో రన్ అవుతుంది. ఇందులో17సభ్యుల్లో సగం ఇంటి సభ్యులు పాతవారు(గత సీజన్లలో పాల్గొన్నవారు) ఉండగా, మిగిలిన వారు కొత్తవారున్నారు. శనివారం ప్రారంభమైన ఈ షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. కొత్త వారిని ఛాలెంజర్స్ టీమ్‌గా, పాత కంటెస్టెంట్లని వారియర్స్ టీమ్‌గా విభజించిన విషయం తెలిసిందే.
సీనియర్లు తమ అనుభవంతో దూకుడు పెంచుతున్న నేపథ్యంలో వారియర్స్ టీమ్‌ని కంట్రోల్ చేసేందుకు బిగ్‌బాస్ జూనియర్లైన ఛాలెంజర్స్ టీమ్‌కి ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు అనుమతి లభించిన ఒక వారియర్ మాత్రమే బెడ్రూమ్‌లో నిద్రపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు బిగ్‌బాస్. అంతేకాదు, వారియర్స్‌కు సంబంధించిన లగేజ్ నుంచి ఒక్కో వారియర్ ఐదు వస్తువులు మాత్రమే తీసుకోవాలని, అవి తీసుకోవడానికి ఛాలెంజర్స్ అనుమతి పొందాలని ట్విస్ట్ ఇచ్చాడు.
Bigg Boss Telugu 6 హౌజ్‌లో ఛాలెంజర్స్ భోజనం చేశాక వారియర్స్ భోజనం చేయాలనే కండీషన్ పెట్టాడు. వారియర్స్ అందరూ మాజీ కంటెస్టెంట్లే కాబట్టి వారికి హౌస్‌ను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీంతో ఇంటి పనులన్నీ వారియర్స్‌కే అప్పజెప్పాడు. ఒకవేళ పనులు చేయకపోతే జూనియర్స్ అయిన ఛాలెంజర్స్ వారిని శిక్షించవచ్చు. ఇక వారియర్స్‌తో సేవలు చేయించుకునే అవకాశం ఉండటంతో చైతూ అషూను ఓ ఆటాడుకున్నాడు.
వాటర్ తీసుకురమ్మని చెప్పడంతో ఆమె బాటిల్‌లో నీళ్లు తీసుకొచ్చింది. తాగించమని చైతూ అడగడంతో అషురెడ్డి తాగించింది. అలా తాగిస్తున్న క్రమంలో చైతూ నీళ్లను ఊసేయడంతో అవి అషూ మీద పడ్డాయి. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. నోట్లో నీళ్లు ఎక్కువవడం వల్ల అలా ఊసేశానని చైతూ క్లారిటీ ఇవ్వడంతో అషూ లైట్ తీసుకుంది. కానీ చైతూ కావాలనే చేశాడనేది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇతర కంటెస్టెంట్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉండటం విశేషం.
మరోవైపు షో మూడో రోజుకి చేరుకుంది. సోమవారం జనరల్‌గా నామినేషన్స్ ఉంటాయి. ఈ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. ఒకరిపై ఒకరు కోపాన్ని, అసంతృప్తిని చాటుకుంటారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ కూడా ఆద్యంతం రక్తికట్టించింది. తమ బాండింగ్‌కి సంబంధించి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ నామినేషన్ చేసుకుంటున్నారు. మొదటి వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో నటరాజ్ మాస్టర్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు. మరి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో సరయు ఫస్ట్ రోజే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో షోలోనూ ఆమె నామినేట్ కావడం గమనార్హం.