
17మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిబ్రవరి 26న ప్రారంభమైది. వీరిలో 8మంది కొత్త కంటెస్టెంట్స్ కాగా 9 మంది పాత కంటెస్టెంట్స్ ఉన్నారు. అషురెడ్డి, అరియానా, అఖిల్, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, సరయు, మొమైత్ ఖాన్, హమీదా, తేజస్వి మాదివాడ గతంలో ప్రసారమైన ఐదు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్. వీరిని వారియర్స్ గా నాగార్జున పరిచయం చేశారు. ఇక కొత్తగా ఈ షోలోకి ప్రవేశించినవారిని చాలెంజర్స్ గా పరిచయం చేశారు.
నటుడు అజయ్, ఆర్జే చైతు, మిత్ర శర్మ, అనిల్ రాథోడ్, స్రవంతి చొక్కరపు, యాంకర్ శివ, శ్రీరాపాక, బిందు మాధవి ఛాలెంజర్స్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటిరోజు పరిచయాలతో ఆహ్లాదంగా గడిచినా, తర్వాత హీట్ మొదలైంది. ఎప్పటిలాగే నామినేషన్స్ విషయంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, పోట్లాటలు జరిగాయి. ఎక్కువ మంది నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశారు. ఆర్జె చైతు... నటరాజ్ మాస్టర్ తనని బాడీ షేమ్ చేశారని అందుకే నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
వారియర్స్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన ఈ నామినేషన్స్ ప్రక్రియలో మెజారిటీ సభ్యులు నటరాజ్ ని నామినేట్ చేశారు. దీనికి ఆయన ఆవేదన చెందారు. ఇక ఈ వారంలో నామినేట్ అయిన ఇంటి సభ్యుల లిస్ట్ చూస్తే... నటరాజ్ మాస్టర్, అరియనా, ముమైత్ ఖాన్, ఆర్జె చైతు, హామీదా, మిత్ర శర్మ ఉన్నారు. ఎక్కువ మంది వారియర్స్ నుండి నామినేట్ కావడం జరిగింది. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేటై హౌస్ వీడనున్నారు.