Manchu Vishnu: మంచు విష్ణు, మోహన్ బాబు పై హెయిర్ డ్రెస్సెర్ షాకింగ్ ఆరోపణలు, సెల్ఫీ వీడియో

Surya Prakash   | Asianet News
Published : Feb 28, 2022, 05:34 PM ISTUpdated : Feb 28, 2022, 06:43 PM IST
Manchu Vishnu: మంచు విష్ణు, మోహన్ బాబు పై హెయిర్ డ్రెస్సెర్ షాకింగ్ ఆరోపణలు, సెల్ఫీ వీడియో

సారాంశం

ఈ నేపథ్యంలోనే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తుందని తెలిపాడు.  

 సినీనటుడు మంచు విష్ణు(Manchu Vishnu) పర్శనల్ హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని  దొంగతనం జరిగిందని అన్నారు. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.   ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తుందని తెలిపాడు.

"

 నాగశ్రీను మాట్లాడుతూ ” మోహన్ బాబు(Mohanbabu), మంచు విష్ణు కలిసి నన్ను చిత్ర హింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి, కులం పేరుతో అవమానించిన కారణంగా నేను ఉద్యోగం మానేశాను. అలా మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని నా మీద అక్రమంగా కేసు పెట్టారు. మోహన్ బాబు నన్ను తిట్టడం, నన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొట్టడం అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఇదంతా ఫిబ్రవరి 17 న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగింది.

నాపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం విని నా తల్లి కి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. 10 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాను. నాపై ఇలాంటి నిందలు వేయడం మీకు భావ్యం కాదు. విష్ణు బాబు నాపై అనవసరంగా కేసు పెట్టించారు. వారు అన్న బూతులు నేను మీకు చెప్పలేను. ఆ మాటలు పడలేకే నేను ఉద్యోగం మానేశాను. నాలాంటి చిన్నవారి జీవితాలతో ఆదుకోవడం మీలాంటి పెద్దవాళ్లకు తగదు. దయచేసి నన్ను వదిలేయండి.

ఈ వీడియో చూసిన పెద్దలు నాకు న్యాయం చేయండి. ” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ కేసుపై మంచి ఫ్యామిలీ నోరువిప్పింది లేదు.. మరి ఈ వీడియోపై మంచు ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

పోలీసుల వివరాల ప్రకారం.. మంచు విష్ణు వద్ద బోరబండకు చెందిన యు.నాగశ్రీను హెయిర్‌ సైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి ఫర్మిషన్ లేకుండా తీసుకెళ్లాడు. ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు. చోరీకి పాల్పడినట్లు లీగల్‌ మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు.

హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని, అతను ఈ చోరీ జరిగినప్పటినుంచి కనిపించడంలేదని విష్ణు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు. మరి ఈ విషయమై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.
 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది