అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారంటున్న సీనియర్ నటుడు

Published : May 22, 2017, 12:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారంటున్న సీనియర్ నటుడు

సారాంశం

అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారంటున్న సీనియర్ నటుడు నాగచైతన్య, రకుల్ రారండోయ్ వేడుక చూద్దాం ఆడియోలో నోరు జారిన చలపతిరావు యాంకర్ అమ్మాయిలు హానికరమా కాదా అని అడిగిన ప్రశ్నకు పక్కలోకే... అంటూ సమాధానం

నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై కింగ్ నాగార్జున నిర్మించిన చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'. ఈ నెల 26న రిలీజ్ కానున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా  టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రం ట్రైలర్ లో హీరో డైలాగ్ ఏంటంటే... దీని వల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే.. అమ్మాయిలు హాననికరం అని ఉంటుంది.

 

ఈ డైలాగ్ ను బేస్ చేసుకుని యాంకర్ సీనియర్ నటుడు చలపతిరావును... అమ్మాయిలు హానికరం అంటారా అని ఆడియో వేడుక సందర్భంగా అడుగుతుంది. దీనికి సమాధానంగా యాంకర్ ఒక అమ్మాయి అని, అక్కడ ఆడియో వేడుకలో కూడా అంతా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనీ... కనీసం అదంతా మీడియాలో ప్రసారమవుతోందని కూడా ఆలోచించకుండా చలపతిరావు అమ్మాయిలపై  వివాదాస్పద వ్యాఖ్యలు  చేయడం కలకలం   రేపింది.

 

ఆదివారం  సాయంత్రం జరిగిన ఈ ఆడియో వేడుకలో అంతా పెద్దాయన అనుకునే ఈ సీనియర్ నటుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విలక్షణ నటన, విలనిజంతో  తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న  చలపతిరావు ఇలా యాంకర్ ప్రశ్నకు వెకిలి సమాధానం చెప్పడంపై పెను దుమారం రేగుతోంది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చలపతిరావు లాంటి పెద్దలు, వయసుకు తగ్గట్టు ప్రవర్తించాల్సిందిపోయి.. అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడడం తగదని అంతా కమెంట్‌ చేస్తున్నారు.

 

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం  ఆడియో ఫంక్షన్‌లో యాంకర్‌  ప్రశ్నించినపుడు  చలపతి  ఇచ్చిన సమాధానంతో  అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. రాయలేని భాషలో మాట్లాడి చెలరేగిపోయాడు.  దీంతో తలపండిన ఈ సీనియర్‌ నటుడి వల్గర్‌ కమెంట్లపై విస్తుపోవడం జనం వంతైాంది. ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ఏంటి.. వక్ర బుద్ధి బయటపడ్డ రోజు పరువంతా గంగలో కలుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి