
భారతదేశం గర్వించదగిన సంగీత దర్శకులలో ఏ.ఆర్. రెహ్మాన్ ఒకరు. భాష ఏదైనా .. ప్రాంతమేదైనా యూత్ లో ఆయనకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రెహ్మాన్ చాలా అరుదుగా మాత్రమే తాజా సినిమాలపై స్పందిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆయన 'బాహుబలి 2'పై స్పందించడం విశేషం.
చెన్నైలో ఆయన 'బాహుబలి 2' సినిమా చూసిన వెంటనే స్పందించారు. ఈ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచిన రాజమౌళికి, మంత్రముగ్ధులను చేసే సంగీతాన్ని అందించిన కీరవాణికి ఆయన అభినందనలు తెలియజేశారు. సౌత్ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారంటూ ప్రశంసలు కురిపించారు. అందుకు వెంటనే రాజమౌళి ప్రతిస్పందిస్తూ .. ఆయన అభినందనలు తమకి ఎంతో ప్రత్యేకమైనవంటూ కృతజ్ఞతలు తెలిపారు.