కేంద్రం కొత్త సినిమాటోగ్రఫీ చట్టం, తప్పు చేస్తే.. తాట తీయబోతున్న మోదీ

Published : Apr 19, 2023, 07:32 PM IST
కేంద్రం కొత్త సినిమాటోగ్రఫీ చట్టం, తప్పు చేస్తే.. తాట తీయబోతున్న  మోదీ

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీకి పైరసీ భూతంలా తగులుకుంది. ఎంత ప్రయత్నించినా.. దాన్ని అరికట్టడం ఇండస్ట్రీ వల్ల కావడంలేదు. దాంతో ఇక కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొత్త చట్టం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.   


సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం.. వదకుండా తగులుకుంది. చావులేని దెయ్యంలా  తయారు అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పైరసీని మాత్రం అరికట్టలేక పోతున్నారు. ఇక దీని గురించి స్టార్ హీరోలు సైతం ఫైట్ చేసిన సంఘటనలు లేకపోలేదు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు  సైతం దీని పై పోరాటానికి ముందడుగు వేశాడు. అర్జున్ సినిమా విషయంలో ఫిలిం ఛాంబర్ దగ్గర కూర్చొని తన నిరసన వ్యక్తం చేశాడు మహేష్. ఇక పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా అయితే విడుదలకు ముందే డీవీడీ రూపంలో బయటకి వచ్చేసింది. ఇలా ఎన్నో సినిమాలు పైరసీ కోరల్లో చిక్కుున్నాయి. అంతే కాదు రీసెంట్ గా రావణాసుర డైలాగ్ కూడా బయటకు బచ్చింది. త్రివిక్రమ్ అరవింద సమేత లాంటి సినిమా సీన్లు కూడా బయటకు వచ్చాయి. 

ఇక ప్రస్తుతం ఈ పైరసీ భూతం ఓటీటీని కూడా పట్టి పీడిస్తోంది. ఆడియన్స్ ఓటిటి కల్చర్ కి అలవాటు పడడంతో దానిని కూడా పైరసీ చేసేస్తున్నారు. ప్రభాస్  అన్‌స్టాఫుబుల్ విత్ NBK ఎపిసోడ్ కూడా రిలీజ్ కి ముందే పలు వెబ్ సైట్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి షో నిర్వాహకులు జాగ్రత్త తీసుకున్నప్పటికీ అది కూడా పైరసీ అయ్యిపోయింది. ఇక ఇది అతి పెద్ద సమస్యగా మారడంతో.. ఈ విషయంలో చాలా సార్లు సినిమా పెద్దలు.. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక ఇన్నాళ్లకు కేంద్రం ఈ విషయంలో స్పందించింది. 

తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకు రావాలని కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న పైరసీని కట్టడి చేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు రావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలియజేశారు. దాంతో ఈనిర్ణయంపై పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్