బైక్ పై లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన మంజు వారియర్, అంతా అజిత్ వల్లే అంటున్న మలయళ బ్యూటీ.

Published : Apr 19, 2023, 05:57 PM ISTUpdated : Apr 19, 2023, 05:58 PM IST
బైక్ పై లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన మంజు వారియర్, అంతా అజిత్ వల్లే అంటున్న మలయళ బ్యూటీ.

సారాంశం

మలయాళం, తమిళ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది  మంజువారియర్.  తన సినిమాలతో కేరళలోనే కాక బయటి రాష్ట్రాల్లో కూడా అభిమానులని సంపాదించింది బ్యూటీ. ప్రస్తుతం బైక్ పై లాంగ్ డ్రౌవ్ చేస్తోంది. 

మలయాళం, తమిళ్ సినిమాలలో నటిస్తూ..స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మంజువారియర్ .  44 ఏళ్ళు వచ్చినా ఇంకా ఏమాత్రం వన్నె తగ్గని మంజు.. యంగ్  హీరోయిన్ లానే కనిపిస్తూ స్టార్ హీరోల సరసన ఆడిపాడుతుంది. రీసెంట్ గా  మంజు వారియర్ తమిళ్ స్టార్ హీరో అజిత్ సరసన  తునివు సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

సినిమాలతో పాటు మంజువారియర్ కు ఇతర కళలలోను ప్రవేశం ఉంది. ఆమెకు తెలిసిన టాలెంట్స్ లో.. బైక్ రైడింగ్ కూడా ఒకటి.  అందులోనూ.. రీసెంట్ గా అజిత్ తో సినిమా చేయడంతో.. అతనితో కలిసి ఆ ఇంట్రెస్ట్ ను ఇంకా పెంచుకున్నారు మంజు. హీరో అజిత్ తనకు టైమ్  కుదిరినప్పుడల్లా బైక్ పై లాంగ్ రైడింగ్స్ చేస్తాడని తెలిసిందే. తునివు సమయంలో అజిత్ తో కలిసిమంజు కూడా వైజాగ్ నుంచి  లడఖ్ వరకు బైక్ రైడింగ్ చేశారు. వీరితో పాటు మరికొంత మంది కూడా ఇందులో పాల్గొన్నారు. అప్పట్లో ఈ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. 
అయితే అజిత్ వల్లే తనకు లాంగ్ బైక్ రైడింగ్స్ అలవాటు అయ్యాయని గతంలో కూడా వెల్లడించింది మంజు. అప్పటి నుంచి ఇలా డ్రైవ్ కు వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అన్నారు. తాజాగా మంజు వారియర్ మరోసారి బైక్ రైడింగ్ కు వెళ్ళింది.మలయాళ నటులు సౌబిన్ షాహిర్, బినేష్ చంద్ర కూడా ఆమెతో కలిసి బైక్ రైడింగ్ కు వెళ్లారు. బైక్ రైడింగ్ మధ్యలో వారితో కలిసి దిగిన ఫోటోలని మంజు వారియర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

 

అంతే కాదు ఈ ఫోటోలు షేర్ చేస్తూ...ఆమె ఓ నోటో కూడా రాసింది. .నేను ఎదుర్కొన్న భయాలు నాలిమిట్స్ లో ఉంటాయి. ఈ ప్రయాణంలో నా కోసం నిలిచిన నా ఫ్రెండ్స్ సౌబిన్ షాహిర్, బినేష్ చంద్రలకు ధన్యవాదాలు అని తెలిపింది. దీంతో మరోసారిమంజు వారియర్ బైక్ రైడింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

ఈమధ్య సినిమాలు తగ్గించింది మంజు వారియర్. అయితే చేసే తక్కువగా సినిమాలు కూడా తన ఇమేజ్ కుభిన్నంగా ఉండే జోరు  పాత్రలు  చేస్తోంది. రీసెంట్ గా అజిత్ హీరోగా నటించిన తునివు సినిమాలో మెరిసింది సీనియర్ బ్యూటీ. రీసెంట్ గాఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె మాట్లాడింది. నేను ఎంచుకునే కథలు.. నాతో పాటు ఆడిన్స్ ను కూడా ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నారు మంజు వారియర్. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా