సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

By Surya PrakashFirst Published Sep 11, 2021, 6:56 AM IST
Highlights

 రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ  ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు.  

ఇక  సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్‌ను వైద్యులు వెల్లడించారు. సాయికి కాలర్ బోన్ ప్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే సాయి ధరమ్ తేజ్ ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించినట్లు వారు తెలిపారు.

 రాబోయే 48గంటల వరకు చెప్పడానికి  ఏమీ ఉండదని వారు అన్నారు. సాయికి అత్యవసరంగా చేయవలసినది ఏమీ లేదన్నారు. రేపు ఉదయం సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడతారని డాక్టర్లు తెలిపారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు. సాయిధరమ్‌ తేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆపరేషన్‌ అవసరం లేదన్నారు.

మరో ప్రక్క సాయి ధరమ్ తేజ్ సేఫ్‌గా ఉన్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. సాయి ధరమ్‌కు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు. అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు. తాను డాక్టర్లతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సాయి ధరమ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం చికిత్సను అందిస్తున్నదని ఆయన తెలిపారు.  
 

click me!