ధరమ్ తేజ్ హెల్త్ కండీషన్... ప్రమాదం లేదు, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది... అపోలో వర్గాల వెల్లడి!

Published : Sep 11, 2021, 01:04 AM IST
ధరమ్ తేజ్ హెల్త్ కండీషన్... ప్రమాదం లేదు, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది... అపోలో వర్గాల వెల్లడి!

సారాంశం

సాయి ధరమ్ హెల్త్ కండీషన్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. 

రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ ఏజ్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వేగంగా వెళుతున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పడంతో సాయి ధరమ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన అనంతరం సాయి ధరమ్ స్పృహ కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దగ్గర్లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం అనంతరం ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 


సాయి ధరమ్ హెల్త్ కండీషన్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బ్రెయిన్, వెన్నుపూసతో పాటు శరీరంలోని ప్రధాన అవయవాలకు ఎటువంటి గాయాలు కాలేదు. కండరాలకు గాయాలతో పాటు కాలర్ బోన్ ఫ్రాక్టర్ అయినట్లు ప్రాథమిక పరీక్షల ద్వారా తేలింది. 24గంటలు క్లోజ్ అబ్సర్వేషన్ లో ఉంటారు. నెక్స్ట్ బులెటిన్ రేపు ఉదయం 9:00 గంటలకు విడుదల చేస్తామని , తెలియజేస్తూ  ప్రెస్ నోట్ విడుదల చేశారు. 


అపోలో ఆసుపత్రి బులెటిన్ ధరమ్ హెల్త్ కండీషన్ పై స్పష్టత తీసుకువచ్చింది. అదే సమయంలో అభిమానుల ఆందోళన దూరం చేసింది. మరోవైపు సాయి ధరమ్ ప్రమాదానికి గురైన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?