త్రిషకు అది కూడా తెలియదా.. వెంటనే అరెస్ట్ చేయాలి, ఇంత అపచారమా

pratap reddy   | Asianet News
Published : Sep 05, 2021, 12:10 PM IST
త్రిషకు అది కూడా తెలియదా.. వెంటనే అరెస్ట్ చేయాలి, ఇంత అపచారమా

సారాంశం

హీరోయిన్ త్రిష సౌత్ లో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందింది. స్టార్ హీరోలందరితో త్రిష కలసి నటించింది. వయసు పెరిగాక సహజంగానే అవకాశాలు తగ్గుతాయి. త్రిష విషయంలో కూడా అదే జరిగింది.

హీరోయిన్ త్రిష సౌత్ లో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందింది. స్టార్ హీరోలందరితో త్రిష కలసి నటించింది. వయసు పెరిగాక సహజంగానే అవకాశాలు తగ్గుతాయి. త్రిష విషయంలో కూడా అదే జరిగింది. అయినప్పటికీ త్రిష లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ఇప్పటికీ రాణిస్తూనే ఉంది. 

అలాగే త్రిషని అప్పుడప్పుడూ వివాదాలు వెంటాడుతూ ఉంటాయి. తాజాగా కొత్త వివాదంలో ఆమె చిక్కుకుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇండోర్ లో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర షూటింగ్ లో గుర్రం మరణించడంతో పెటా సంస్థ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేశారు. తాజాగా త్రిషని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

షూటింగ్ లో భాగంగా ఓ టెంపుల్ లో త్రిష.. శివలింగం, నంది విగ్రహాల మధ్య చెప్పులతో నడుస్తున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హిందూ ఆలయాల్లో చెప్పులు లేకుండా వెళ్లాలనే విషయం కూడా త్రిషకు తెలియదా అని హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. ఇప్పటికే కొందరు త్రిష, మణిరత్నం పై హరికేష్ లో పోలీస్ కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది