breaking: హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణాలివేనా?

Published : Jan 21, 2022, 06:51 PM ISTUpdated : Jan 21, 2022, 07:02 PM IST
breaking: హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణాలివేనా?

సారాంశం

మాస్‌ మహారాజా రవితేజ తల్లిపై కేసు నమోదైంది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) తల్లిపై కేసు నమోదైంది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. రవితేజ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నెంబర్‌ 108,124లో పుష్కర కాలువ, స్లూయిజ్‌ నిర్మాణ పనులను భూపతి రాజ్యలక్ష్మితోపాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌ అనే వ్యక్తి ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై రవితేజగానీ, ఆయన తల్లి నుంచిగానీ ఎలాంటి స్పందన లేదు. రవితేజ ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది. కానీ ఎప్పుడూ లేదని రవితేజ తల్లి వార్తల్లో నిలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఇక రవితేజ వరుస పరాజయాల అనంతరం `క్రాక్‌` సినిమాతో హిట్‌ కొట్టి ఇప్పుడు కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన `ఖిలాడీ` చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతోపాటు `రామారావు`, `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితోపాటు మరో చిత్రాలు ఆయన జాబితాలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలను లైనప్‌లో పెట్టి జెట్‌ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే