తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసింది.

ఈ సినిమాని వచ్చే నెల 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత సౌత్ ఇండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో 'సెంగోల్' అనే టైటిల్ తో ఒక కథను 2007లో రిజిస్టర్ చేయించుకున్నాడట.
ఇప్పుడు మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' కథ తనకు దగ్గరగా ఉందని.. తనకు న్యాయం జరిగేవరకు సినిమా విడుదల జరగకూడదని వరుణ్ హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. తనకు పరిహారంగా రూ.30 లక్షల డబ్బు, సినిమా టైటిల్స్ లో కథ క్రెడిట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
వాదనలు విన్న న్యాయమూర్తి వచ్చే వారానికి కేసుని వాయిదా వేశారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి!
ఇవి కూడా చదవండి..
సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?
సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!
యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!