స్టార్ హీరోయిన్ పై పోలీస్ కేసు!

Published : Aug 20, 2018, 10:52 AM ISTUpdated : Sep 09, 2018, 12:59 PM IST
స్టార్ హీరోయిన్ పై పోలీస్ కేసు!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొన్నటివరకు హృతిక్ రోషన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ మరోసారి చీటింగ్ కేసులో వార్తల్లో నిలిచింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొన్నటివరకు హృతిక్ రోషన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ మరోసారి చీటింగ్ కేసులో వార్తల్లో నిలిచింది. అసలు విషయంలోకి వస్తే.. గతేడాది కంగనా ముంబై పాలీహిల్ లో రూ.20 కోట్ల విలువైన భవంతిని కొనుగోలు చేశారు.

ఆ ఇల్లు కొనడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రకాష్ జీ రోహిర అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని కంగన, ఆమె సోదరి రంగోలీపై ముంబైలోకి ఖర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. అయితే ఒప్పందం ప్రకారం మధ్యవర్తి ప్రకాష్ కి 1% అనగా ఇరవై లక్షల రూపాయలు చెల్లించామని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ దగ్గర ఉన్నాయని కంగనా తరఫు ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రస్తుతం కంగనా క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న 'మణికర్ణిక' సినిమాలో నటిస్తున్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?