బిగ్ బాస్2: దీప్తి సునైనా ఔట్.. ఎమోషనల్ అయిన తనీష్

Published : Aug 19, 2018, 11:48 PM ISTUpdated : Sep 09, 2018, 12:31 PM IST
బిగ్ బాస్2: దీప్తి సునైనా ఔట్.. ఎమోషనల్ అయిన తనీష్

సారాంశం

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 2పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ షో 70 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో బయటకి ఎవరు రాబోతున్నారనే విషయాన్ని ఆడియన్స్ ముందుగానే ఊహించేశారు

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 2పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ షో 70 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో బయటకి ఎవరు రాబోతున్నారనే విషయాన్ని ఆడియన్స్ ముందుగానే ఊహించేశారు. అనుకున్నట్లుగానే దీప్తి సునైనా హౌస్ నుండి బయటకి వచ్చేసింది. నామినేషన్స్ లో ఉన్నవారిలో గీతామాధురి, శ్యామల సేవ్ అయినట్లు నిన్న నాని ప్రకటించగా నేటి ఎపిసోడ్ లో దీప్తి సునైనా ఎలిమినేట్ అయిందనే విషయాన్ని వెల్లడించారు.

దీప్తి సునైనా హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. తరువాత స్టేజ్ మీదకి వచ్చిన సునైనా.. తనీష్, సామ్రాట్ లతో మాట్లాడాలని ఉందని కోరింది. తనీష్ తో మాట్లాడుతూ.. 'ఎందుకు ఎమోషనల్ అవుతున్నావ్.. టైటిల్ కొట్టి బయటకి రా' అని చెప్పగానే తనీష్ 'నాకు కూతురు పుడితే నీలాగానే ఉండాలని కోరుకుంటాను. నువ్ నీలానే ఉండు' అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత సునైనా బిగ్ బాంబ్ ని తనీష్ పై విసిరింది. 

దీని ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో సాంగ్ వచ్చిన ప్రతిసారి స్విమ్మింగ్ పూల్ లో దూకాల్సివుంటుంది. సునైనా ఎలిమినేట్ కావడం వెనుక కౌశల్ ఆర్మీ ప్రభావం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?