బాబాయ్ వల్లే సగం గొడవలు.. పవన్ పై చిరు కూతురు కామెంట్స్!

Published : Aug 20, 2018, 10:41 AM ISTUpdated : Sep 09, 2018, 01:33 PM IST
బాబాయ్ వల్లే సగం గొడవలు.. పవన్ పై చిరు కూతురు కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ అగ్రహీరోగా వెలుగొంది కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాందించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు

టాలీవుడ్ అగ్రహీరోగా వెలుగొంది కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాందించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజలు మెగాఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

'నేను చరణ్, శ్రీజ మా ముగ్గురిలో శ్రీజ సైలెంట్ గా ఉండేది. నేను చరణ్ బాగా కొట్టుకునేవాళ్లం. కానీ శ్రీజ ఎవరికీ సపోర్ట్ చేయకుండా చూస్తూ ఉండేది. కళ్యాణ్ బాబాయ్ మాత్రం మేమిద్దరం కొట్టుకుంటే ఎంకరేజ్ చేసేవారు. ఏదోకటి చెప్పి చరణ్ కి నాకు గొడవలు పెట్టేవారు. మాతో కలిసి ఆయన కూడా అల్లరి చేసేవారు. సగం గొడవలు ఆయన వల్లే జరిగేవి. ఇంట్లో మా గొడవలు బాబాయ్ కి మంచి ఫన్' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక శ్రీజ మాట్లాడుతూ.. 'అక్క, అన్నయ్య గొడవ పడుతుంటే నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు కూర్చునేదాన్ని. ఇంట్లో నేను చిన్నపిల్లనని అందరూ నన్ను ముద్దు చేసేవారు. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్ కి వెళ్లి మాస్టర్స్ చేశా' అని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌