సినారేకు ఎన్టీఆర్ ప్రత్యేక ఆతిథ్యం.. అలా సినీ పరిశ్రమలోకి...

First Published Jun 12, 2017, 9:09 PM IST
Highlights
  • సినీ పరిశ్రమలోకి రాకమునుపు లెక్చరర్ గా పనిచేసిన సి నారాయణరెడ్డి
  • నందమూరి తారకరామారావు సహకారంతో తొలి చిత్రంతోనే రాచబాట
  • మద్రాస్ కు వెళ్లిన సినారేను స్వయంగా రిసీవ్ చేసుకున్న ఎన్టీఆర్

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, సాహితీ దిగ్గజం సి.నారాయణరెడ్డి అనుబంధం ప్రత్యేకమైనది. సినీ పరిశ్రమలో నటులు, సాహితీవేత్తలతో సినారె చాలా సానుకూలంగా వ్యవహరించేవారని, అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టమని అంటుంటారు. ఆయన వ్యవహార శైలి, ప్రతిభ వల్లే టాలీవుడ్‌లో పట్టు సాధించారనేది ఆయన సన్నిహితులు వెల్లడిస్తారు.

 

గులేబకావళి సినిమా కోసం ఎన్టీఆర్, సినారేల మధ్య ఏర్పడిన పరిచయం గాఢమైన స్నేహంగా మారింది. సినారే ప్రతిభ గురించి తెలుసుకొన్న ఎన్టీఆర్ స్వయంగా ఆహ్వానించారట. అంతేకాకుండా ఓ డ్యూయెట్ సాంగ్‌ రాయాలని కోరారట. ఆ చిత్రంలో అన్ని పాటలు రాసే అవకాశం లభించడంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన రాసిన నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని పాట సూపర్ హిట్ కావడంతో సినారేకు తిరుగులేకుండా పోయింది.

 

అప్పటికే లెక్చరర్‌గా పనిచేస్తున్న సినారే గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ .. ఓ మిత్రుని ద్వారా సినారేను కలిశాడు. ఆ సందర్భంగా.. రెడ్డి గారూ మీ గురించి విన్నాం. మేం త్వరలో తీయబోతున్న గులేబకావళి కథ చిత్రానికి మీరే పాటలు రాయాలి. వీలుచూసుకుని మద్రాసు రండి' అని ఎన్టీఆర్ కోరారట. అప్పటికే అగ్రహీరోగా ఉన్న ఎన్టీఆర్ చెప్పిన మాటలతో 1960 మార్చి 10వ తేదీన హైదరాబాద్ నుంచి మద్రాస్‌కు బయలుదేరారు.

 

హైదరాబాద్ నుంచి బయలు దేరిన సినారేకు మద్రాస్ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. స్వయంగా ఎన్టీఆర్ స్టేషన్‌కు వచ్చి సాదరంగా తన కారులో ఇంటికి తీసుకెళ్లారట. గులేబాకావళి సినిమా స్క్రిప్ట్ ఇచ్చి పాటల సందర్భాన్ని వివరించారట. దాంతో అణిముత్యాల్లాంటి పాటలకు అక్కడ బీజం పడింది. సింగిల్ కార్డుతో రాసిన పాటలను ఘంటశాల, సుశీల పాడారు. సినారే రాసిన పాటలకు ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు. అణిముత్యాల్లాంటి పాటలు నారాయణరెడ్డి సినిమా ప్రస్థానం అలా ప్రారంభమైంది.

 

ఆ తర్వాత చాలా సినిమాల్లో దాదాపు మూడు వేలకు పైగా పాటలు రాశారు. 1962లో ఆత్మబంధువు సినిమాలో ‘అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి'... ‘చదువురాని వాడవని దిగులు చెందకు', తళ్లా? పెళ్లామా? చిత్రంలో.. తెలుగు జాతి మనది అంటూ సినీ సాహితీ జగత్తులో తనదైన ముద్ర వేసి అప్రతిహతంగా సాగారు సినారే.

click me!