"రాధా" పోలీసుల విలువను పెంచే సినిమా: బీవీఎస్ఎన్ ప్రసాద్

Published : May 13, 2017, 11:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
"రాధా" పోలీసుల విలువను పెంచే సినిమా: బీవీఎస్ఎన్ ప్రసాద్

సారాంశం

రాధా చిత్రం సక్సెస్ పై నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ పోలీసులకు గౌరవాన్ని పెంచే సినిమా రాధా ఎస్ వీ సీసీ బేనర్ లో తదుపరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత బీవీఎస్ఎన్ ప్రసాద్ తాజాగా శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందిన 'రాధ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. నిన్ననే ఈ సినిమా భారీ స్థాయిలో  రిలీజై పాజిటివ్ టాక్ సాధించింది.  ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడారు. దర్శకుడు చంద్రమోహన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడనీ, శర్వానంద్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడని చెప్పారు.

 

పోలీసుల పట్ల విలువను పెంచే చిత్రమనీ .. ప్రతి పోలీస్ చూడదగిన సినిమా అని అన్నారు. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని తాను ఈ సినిమా చూశాననీ, వాళ్ల నుంచి వస్తోన్న రెస్పాన్స్ తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. త్వరలో తమ బ్యానర్లో రానున్న సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా ఉంటాడనీ, వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని అన్నారు. భారీ వసూళ్లతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు