ప్రజారాజ్యం గెలిచిన చోట హైపర్ ఆదికి జనసేన సీటు? 

By Sambi ReddyFirst Published Jan 20, 2023, 5:31 PM IST
Highlights


రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయడం ఖాయం అంటున్నారు. ఆయన జనసేన తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా బరిలో దిగుతారట. ఆయన పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే అంటూ ప్రచారం మొదలైంది. 
 

హైపర్ ఆది జనసేన సానుభూతిపరుడన్న విషయం తెలిసిందే. రణస్థలం యువశక్తి వేదికపై అనర్గళంగా మాట్లాడి జనసేన వర్గాల్లో హీరో అయ్యాడు. హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనివార్యమే అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే కాండిడేట్ గా బరిలో దిగనున్నాడట. ఈ మేరకు జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుందట. జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకున్నా? లేకున్నా? జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా హైపర్ ఆది పోటీ చేస్తాడట. 

ఇక హైపర్ ఆదికి ఏ నియోజకవర్గం కేటాయించాలి. ఎక్కడ నిలబెడితే ఆయనకు విజయావకాశాలు ఉంటాయన్న ప్రణాళికలు వేస్తున్నారట. జనసేన సమీకరణాల్లో భాగంగా హైపర్ ఆది సొంత జిల్లా ప్రకాశంలోనే ఆయనకు సీటు కేటాయించాలనుకుంటున్నారట. ముఖ్యంగా దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారట. ఆసక్తికర విషయం ఏమిటంటే గతంలో గిద్దలూరులో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు గెలుపొందారు. 

కాబట్టి హైపర్ ఆదికి గిద్దలూరు అసెంబ్లీ సీటు కేటాయించనున్నారట. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అధికారిక సమాచారం లేదు. ఎందుకంటే జనసేన ఇంకా ఎన్నికలకు సమాయత్తం కాలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని కీలక ప్రకటనలు చేయాల్సి ఉంది. టీడీపీతో పొత్తుపై హింట్ ఇచ్చిన పవన్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. టీడీపీతో పొత్తు ఖాయమని జనసైనికులు ఫిక్స్ అయ్యారు. అయితే సీఎం అభ్యర్థిగా పవన్ ఉండబోతున్నారన్న కలలుకంటున్నారు. టీడీపీ-జనసేన పొత్తు, సీట్ల పంపకం, సీఎం అభ్యర్థి ఎవరో... తేలితే కానీ 2024 ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఏమిటో బోధపడదు. 

click me!