
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. బుధవారం ఉత్సవాల మాదిరి అట్టహాసంగా బర్త్ డేను జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రతీ సారి మహేష్ బర్త్ డే సందర్భంగా... జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిసారి ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇస్తారు.. ఫస్ట్ లుక్ కాని.. టైటిల్ కాని.. టీజర్ కాని.. ఇలా ఏదో ఒకటి ఇస్తారు. అయితే ఈసారి మాత్రం మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ ను ఇస్తారన్న ఆశతో ఉన్నారు టీమ్. అయితే ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్ తన సినిమాల అప్ డేట్‌లని ఇంత వరకు ఇస్తూ వచ్చారు. బుధవారం మహేష్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న నేపథ్యంలో `గుంటూరు కారం` నుంచి బిగ్ అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
`సర్కారు వారి పాట` తరువాత కాస్త గ్యాప్ తో మహేష్ బాబు నటిస్తున్న మూవీ కావడంతో `గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఈ అర్థరాత్రి 12.06 గంటలకు సాలిడ్ అప్ డేట్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా ఏం అప్ డేట్ ఇస్తారు అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదరు చూస్తున్నారు. ఈసినిమా నుంచి గ్లింప్స్ వీడియో ఉంటుందని లేదు సాంగ్ ఒకటి కంప్లీట్ అయ్యింది.. అందుకే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని.. కాదు కాదు కొత్త పోస్టర్ తో సరిపెడతారు అంటూ.. రకరకాల ఊహాగానాలు ఊపు అందుకున్నాయి.
అయితే అసలు రేపు ఏం అప్ డేట్ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి కరంగా మారింది. దాదాపు ఈసినిమా నుంచి కొత్త పోస్టర్ తోనే సరిపెడతారన్న టాక్ గట్టిగా నడుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఓ పాట రెడీ అయినా.. ఆ ట్యూన్ నచ్చకపోవడంతో.. మార్చమని చెప్పాడట మహేష్ బాబు. దాంతో తమన్ ఆ పనిలో ఉన్నాడు. దాంతో లిరికల్ సాంగ్ రిలీజ్ అనే దానిపై ఆశలు లేవు. ఇక ఏదైనా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి.. ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగనే లేదు. ఇప్పటికే పెద్దగా షూటింగ్ జరిగింది లేదు.
అసలు ఈసినిమా స్టార్ట్ అయినప్పటి నుంచీ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. ఆదినుంచి ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దాదాపు పుష్కకాలం తరువాత వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆది నుంచి ఈ సినిమాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాక అది నచ్చకపోవడంతో త్రివిక్రమ్ దాన్ని పక్కన పడేసి కొత్త కథతో సరికొత్త సీన్‌లతో గుంటూరు కారం`ని పట్టాలెక్కించారు. పూజా హెగ్డే ను తీసుకుని తీసేశారు.. మళ్ళీ తీసుకున్నారన్న టాక్ ఉంది.. కాని కన్ఫార్మ్ కాలేదు.
ఇక త్రివిక్రమ్ మొన్నటి వరకూ బ్రో మూవీకి డైలాగ్స్..స్క్రీన్ ప్లే రాస్తూ కూర్చున్నాడు..దాంతో గుంటూరు కారం సినిమాను కాస్త నిర్లక్ష్యం చేస్తున్నాడన్న టాక్ గట్టిగా వినిపించింది. దాంతో మహేష్ బాబు కూడా ఛాన్స్ దొరికితే..వెకేషన్లకు బయలుదేరుతున్నాడు. ఈ ప్రభావంతో గుంటూరు కారం మూవీ షూటింగ్ మాత్రం పెండింగ్ పడుతూ వస్తోంది. వీరి మధ్యలో నిర్మాతలు నలుగుతున్నారు. అటు ఫ్యాన్స్ కూడా ఇబ్బందిపడుతున్నారు.
ఇక రీసెంట్ గా ఈసినిమాకు సబంధించి ఇంపార్టెంట్ సీన్స్ ను షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది అది పూర్తి చేసిన మహేష్ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక వెకేషన్ కోసం లండన్ వెళ్లారు. ఈ సారి బర్త్‌డే వేడుకల్ని స్కాట్లాండ్‌లో జరుపుకోబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి టీమ్ అప్ డేట్ ఇచ్చి చాలా రోజులవుతోంది. బుధవారం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నుంచి బిగ్ అప్ డేట్‌ని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లేదా బ్రాండ్ న్యూ పోస్టర్‌ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. మరి అందులో అభిమానులకు ఏం దక్కుతుందో చూడాలి మరి.