ఒకే తలలో ఇద్దరు : అదే ఆది 'బుర్ర కథ'

By Udaya DFirst Published Apr 11, 2019, 6:12 PM IST
Highlights

మరో రచయిత  డైమండ్ రత్నబాబు.. మెగా ఫోన్ పట్టి డైరక్యర్ అయ్యారు. యంగ్ హీరో  ఆది సాయికుమార్‌తో ఆయన ‘బుర్ర కథ’ అనే సినిమా డైరక్ట్ చేసారు. 

మరో రచయిత  డైమండ్ రత్నబాబు.. మెగా ఫోన్ పట్టి డైరక్యర్ అయ్యారు. యంగ్ హీరో  ఆది సాయికుమార్‌తో ఆయన ‘బుర్ర కథ’ అనే సినిమా డైరక్ట్ చేసారు. ఈ రోజే దీని ఫస్ట్ లుక్ పోస్టర్ , మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బుర్రకథ’ అంటే పూర్వ కాలం రోజుల్లో చెప్పే కథ కాదు. ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

ఇందులో హీరోకు తలలో రెండు బుర్రలుంటాయట. మనిషి చూసేందుకు ఒక్కడే కానీ.. అతడిలో ఇద్దరు వ్యక్తులున్నట్లు బిహేవ్ చేస్తాడట. రెండు బుర్రలుండటం వల్ల అపరిచితుడులో  స్ప్లిట్ పర్సనాలిటీ తరహాలో విచిత్రంగా ప్రవర్తిస్తాడట. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఈ విషయాన్ని సూచించేలా ‘బుర్ర’లో ‘ర’ను రెండుగా విభజించి చూపించారు. ఆది కూడా ఇద్దరిగా కనపడ్డాడు. అలాగే ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని సైతం ఆవిష్కరించారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లోన‌టించారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌,మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా, అభిమ‌న్యుసింగ్, ఫిష్ వెంక‌ట్‌, ప్ర‌భాస్ శ్రీను, గీతా సింగ్ త‌దిత‌రులు. సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు, నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌, నిర్మాణ సంస్థ‌: దీపాల ఆర్ట్స్‌, మ్యూజిక్‌: సాయికార్తీక్‌, సినిమాటోగ్ర‌ఫీ: సి.రాంప్ర‌సాద్‌, ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ ,స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌భ‌వాన్ దిడ్ల, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శివ శ‌క్తిద‌త్తా, భాస్క‌ర్ల భ‌ట్ల‌, కె.కె, ఫైట్స్‌: వెంక‌ట్‌, స‌ల్మాన్ రాజ్‌, రియ‌ల్ స‌తీష్‌.

 

click me!