ఆ తర్వాత సుకుమార్..ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దాం అనే డైలమోలో ఉన్నారు. అల్లు అర్జున్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే కరోనా తర్వాత వచ్చే వీక్నెస్ తో కొద్ది రోజులు ఆగుదాం అన్నారట. ఇప్పుడు ఇక షూట్ ప్రారంభిద్దాం అని చెప్పారట. బన్ని గత కొద్ది రోజులుగా ఫిజికల్ గా పికప్ అవ్వటం కోసం జిమ్ కు వెళ్తున్నారట.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసి తెరకెక్కుతున్న సినిమా పుష్ప. డైరక్టర్ సుకుమార్ ఎప్పటిలాగే అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే సినిమాను ఓ లెవల్ లో హైప్ క్రియేట్ చేసేసాయి. అయితే.. అన్ని సినిమాలాగానే ఈ సినిమాకు కూడా కరోనాతో బ్రేకులు పడ్డాయి. మిగతా సినిమాలన్నీ కరోనా దెబ్బకు వాయిదా పడినా.. ఏకంగా హీరో అల్లు అర్జున్ కు కరోనా సోకినా సుకుమార్ షూటింగ్ మాత్రం ఆపకూడదనుకున్నారు.
హీరో లేని సన్నివేశాలతో పాటు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ సన్నివేశాలను సుకుమార్ ప్లాన్ చేసి షూట్ చేసారు. అనుకున్న విధంగానే మరో వారం రోజులు షూటింగ్ నడిపించాడు. కానీ అనుకోని విధంగా ఫహద్ ఫాజిల్ కూడా కరోనా బారిన పడ్డారో,భయపడ్డారో కానీ కేరళ వెళ్లపోయారు. దీంతో ఫైనల్ గా షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సుకుమార్..ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దాం అనే డైలమోలో ఉన్నారు. అల్లు అర్జున్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే కరోనా తర్వాత వచ్చే వీక్నెస్ తో కొద్ది రోజులు ఆగుదాం అన్నారట. ఇప్పుడు ఇక షూట్ ప్రారంభిద్దాం అని చెప్పారట. బన్ని గత కొద్ది రోజులుగా ఫిజికల్ గా పికప్ అవ్వటం కోసం జిమ్ కు వెళ్తున్నారట.
ఇక ఇప్పటికే సినిమాలో కీలకమైన కొంత భాగాన్ని కేరళలో, ముఖ్యమైన ఫారెస్ట్ సన్నివేశాలను ఏపీలోని మారేడుమిల్లి, తమిళనాడులోని తెన్ కాశీ పరిసరాలలో షూటింగ్ నిర్వహించారు. తదుపరి షెడ్యూల్ ను వాయిదా వేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. దానికి ఇంకా మూడున్నర నెలల సమయం ఉండగా అప్పటికి షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటుంటున్నారు.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సౌండ్ డిజైనర్‌గా ఆస్కార్ విజేత పూకుట్టిని తీసుకున్నట్టు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.