బాలకృష్ణ బర్త్ డే ట్రీట్‌కి టైమ్‌ ఫిక్స్.. మోత మోగాల్సిందేనట!

By Aithagoni RajuFirst Published Jun 8, 2021, 4:42 PM IST
Highlights

బాలకృష్ణ నటిస్తున్న `అఖండ` చిత్రం నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. 

బాలయ్య నుంచి బర్త్ డే ట్రీట్‌కి రంగం సిద్ధమైంది. అంతా ఊహించినట్టే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న `అఖండ` చిత్రం నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. రేపు(బుధవారం) ఈ కొత్త లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

`బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్‌ ముందుగానే స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `అఖండ` సినిమా నుంచి కొత్త బర్త్ డే పోస్టర్‌ని రేపు సాయంత్రం 4.36 గంటలకు విడుదల చేయబోతున్నాం` అని ట్వీట్‌ చేశారు మేకర్స్. `అఖండ బర్త్ డే రోర్‌` పేరుతో ఈ కొత్త లుక్‌ విడుదల కాబోతుందని, ఈ సారి మోత మోగాల్సిందేనంటున్నారు యూనిట్‌. ఇక ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Celebration will start early!!🔥
A new birthday poster will be released Tomorrow at 4:36PM on the occasion of our gari birthday.

— Dwaraka Creations (@dwarakacreation)

 ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్‌, రెండు ఫస్ట్ లుక్‌లు విడుదలయ్యాయి. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి అఘోరగా కావడం విశేషం.  ఈ నెల 10(గురువారం) బాలకృష్ణ బర్త్ డే అనే విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో బర్త్ డే సందర్భంగా ఎవరూ తనని కలిసేందుకు రావద్దని ఇప్పటికే అభిమానులకు సందేశాన్ని పంపించాడు బాలయ్య. అలాగే ఎవరూ బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని చెప్పారు. 

click me!