పవన్‌ ఫ్యాన్స్ కి షాక్‌.. `బ్రో` టీజర్‌ డిలే.. కారణం ఏంటంటే?

Published : Jun 29, 2023, 05:12 PM ISTUpdated : Jun 29, 2023, 05:13 PM IST
పవన్‌ ఫ్యాన్స్ కి షాక్‌.. `బ్రో` టీజర్‌ డిలే.. కారణం ఏంటంటే?

సారాంశం

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, సాయితేజ్‌ ఫ్యాన్స్ `బ్రో` టీజర్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ అనూహ్యంగా టీమ్‌ పెద్ద షాకిచ్చింది. టీజర్‌ డిలే అంటూ ప్రకటించింది. 

`బ్రో` సినిమా టీజర్‌ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురయ్యింది. టీజర్‌ అనుకున్న టైమ్‌కి రావడం లేదు. `బ్రో` టీజర్‌ని నేడు(గురువారం) సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రిలీజ్‌ చేస్తున్నట్టు టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు మూడు రోజులుగా ఈ అప్‌డేట్‌తో హడావుడి చేస్తుంది టీమ్‌. అర్థగంట ముందు కూడా కౌంట్‌ డౌన్‌ అంటూ పోస్టర్ రిలీజ్‌ చేసింది. తీరా టైమ్‌కి ఝలక్‌ ఇచ్చింది. టీజర్‌ డిలే అవుతుందని వెల్లడించింది.

`అనుకోని సాంకేతిక లోపం బ్రో` టీజర్‌ మాస్‌ సెలబ్రేషన్‌లకు చిన్న విరామం ఇచ్చిందని మీకు తెలియజేయడానికి మేం చింతిస్తున్నాం. మేం దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. దయజేసి మాకు కొంత టైమ్‌ ఇవ్వండి` అంటూ టీమ్‌ ప్రకటించింది. దీంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. అయితే ఎంత సేపు వెయిట్‌ చేయాలనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ సాయంత్రం ఎట్టకేలకు విడుదల చేయబోతుందని చెప్పొచ్చు. దీంతో పవన్‌ ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టుకుని టీజర్‌ కోసం వేచి చూస్తున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, మెగా మేనల్లుడు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రమిది. తమిళ దర్శకుడు, ప్రముఖ నటుడు సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో రూపొంది హిట్‌ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్‌. తెలుగుకి తగ్గట్టుగా సముద్రఖని మార్పులు చేశారు. 

సినిమా టీజర్‌ కోసం బుధవారం మంగళగిరిలో తన వారాహి రథ యాత్ర వద్ద డబ్బింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలోనే పవన్‌ ఈ టీజర్‌ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. టీమ్‌తో కలిసి ఎంజాయ్‌ చేశారు. దీంతో టీజర్‌ పవర్‌ ప్యాక్డ్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. దానికోసం వెయ్యి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. అంతలోనే టీమ్‌ ఇలా వెయిటింగ్‌ ట్విస్ట్ ఇవ్వడంతో డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాని జులై 28న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?