బ్రేకింగ్: లగాన్ మూవీ నటుడు కన్నుమూత!

Published : Feb 14, 2023, 07:33 PM ISTUpdated : Feb 14, 2023, 07:49 PM IST
బ్రేకింగ్: లగాన్ మూవీ నటుడు కన్నుమూత!

సారాంశం

చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు మరో విషాదం చోటు చేసుకుంది. లగాన్ ఫేమ్ జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు.   

బాలీవుడ్ లో విషాదం చోటు చేసింది. ప్రముఖ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. జావేద్ అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... ఏడాది కాలంగా జావేద్ ఖాన్ శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. నేడు ఆయన ఆరోగ్యం విషమించింది. ముంబై శాంతా క్రూజ్ ఏరియాలో గల సూర్య నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేశారు. ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 6:30 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 

జావేద్ మృతిని లగాన్ మూవీలో ఆయనతో కలిసి నటించిన అఖిలేంద్ర మిశ్రా ధృవీకరించారు. జావేద్ నేను ఒకేసారి నటులుగా కెరీర్ మొదలుపెట్టాము. ఆయనను కలిసి చాలా కాలం అవుతుంది. వాట్స్ అప్ గ్రూప్ లో మేము సభ్యులుగా ఉన్నారు. ఆ విధంగా జావేద్ మృతి సమాచారం మాకు తెలిసిందని, అఖిలేంద్ర మిశ్రా మీడియాకు తెలియజేశారు.  ముంబైలో పుట్టిన జావేద్ ఖాన్ 1973 నుండి పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. 150 కి పైగా చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్ లో నటించారు. 

ఆస్కార్ నామినేటెడ్ మూవీ లగాన్ లో ఆయన కీలక రోల్ చేశారు. అలాగే షారుక్ ఖాన్ 'చెక్ దే ఇండియా' లో కూడా నటించారు. అందాజ్ అప్నా అప్నా, మీర్జా గాలిబ్, గుల్జార్, నుక్కడ్ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాల్లో  జావేద్ ఖాన్ భాగమయ్యారు.  జావేద్ ఖాన్ చివరిగా సడక్ 2 మూవీలో నటించినట్లు సమాచారం. మహేష్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు చేశారు. జావేద్ మృతి వార్త తెలిసిన చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఓషివారా స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?