బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకి చిరు సత్కారం.. సందడి చేసిన నటి రాధిక

Published : Aug 21, 2021, 10:05 AM IST
బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకి చిరు సత్కారం.. సందడి చేసిన నటి రాధిక

సారాంశం

ఇటీవల టోక్యో ఒలింపిక్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కాంస్యం గెలిచింది. ఈ నేపథ్యంలో ఆమెని చిరంజీవి సత్కరించారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి సత్కరించారు. ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల టోక్యో ఒలింపిక్స్-202`లో కాంస్య పతకం గెలుచుకుని రికార్డ్ సృష్టిచింది బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. ఆమె బ్యాక్ టూ బ్యాక్‌ ఒలింపిక్స్ లో కాంస్య సాధించిన ఇండియన్ మహిళగా సంచలనం సృష్టించింది. దేశం గర్వించేలా చేసింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకి అనేక మంది టాలీవుడ్‌ సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆమె క్రీడా స్ఫూర్తిని కొనియాడారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా పీవీ సింధుని సత్కరించారు. హైదరాబాద్‌లో ఆమెకి ఘనంగా సత్కరించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఇందులో సీనియర్‌ నటి రాధిక, పీవీ సింధు, చిరంజీవి కలిసి ఫోటో దిగారు. రాధిక.. సింధు గెలుచుకున్న మెడల్‌ని పట్టుకుని నవ్వుతూ పోజులివ్వడం ఆకట్టుకుంటుంది. ఈ పిక్‌ని రాధికా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 

ఆమె చెబుతూ, `పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు చిరంజీవి.. సింధును సత్కరించే వేడుకలో నేను పాల్గొనడం గొప్ప అనుభూతి పంచింది` అని పేర్కొన్నారు. అయితే అది ఎక్కడ? అనే వివరాలు తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా రేపు చిరంజీవి తన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి