మోక్షజ్ఞ డెబ్యూపై బోయపాటి కామెంట్!

By Udayavani DhuliFirst Published Jan 6, 2019, 11:38 AM IST
Highlights

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 'ఎన్టీఆర్' బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని తెలుస్తోంది.

2019లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చాలా సార్లు చెప్పాడు. దీంతో మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బోయపాటి పేరు బాగా వినిపించింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో సినిమా పూర్తయిన తరువాత మోక్షజ్ఞ సినిమా ఉంటుందని అన్నారు.

ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు బోయపాటి శ్రీను. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా తనతో చేయడం కరెక్ట్ కాదని అన్నాడు బోయపాటి. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల అంచనాలు పెరిగిపోతాయని, రెండు మూడు సినిమాలు చేసిన తరువాత అయితే బాగుంటుందని అన్నారు.

అలానే చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు ఒప్పుకున్నారు. అవి పూర్తయిన తరువాత నా సినిమా ఉంటుంది. ఓ లైన్ అనుకున్నాం.. దాన్ని స్క్రిప్ట్ రూపంలో తీసుకురావాలి'' అంటూ చెప్పుకొచ్చాడు. 

click me!