స్టార్ హీరోయిన్ల మ్యానేజర్ అరెస్ట్.. ఏం జరిగిందంటే..?

Published : Jan 06, 2019, 11:06 AM IST
స్టార్ హీరోయిన్ల మ్యానేజర్ అరెస్ట్.. ఏం జరిగిందంటే..?

సారాంశం

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు మ్యానేజర్ గా పని చేస్తుంటాడు కళ్యాణ్ సుంకర. బయట వారికి ఈయన పెద్దగా తెలియనప్పటికీ సినిమా ఇండస్ట్రీతో టచ్ ఉన్న వారికి ఈ పేరు బాగా తెలుసు. 

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు మ్యానేజర్ గా పని చేస్తుంటాడు కళ్యాణ్ సుంకర. బయట వారికి ఈయన పెద్దగా తెలియనప్పటికీ సినిమా ఇండస్ట్రీతో టచ్ ఉన్న వారికి ఈ పేరు బాగా తెలుసు. పలు హీరోలతో, దర్శకనిర్మాతలతో కళ్యాణ్ సుంకరకి మంచి పరిచయాలు ఉన్నాయి.

అయితే ఇటీవల పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉంటున్నాడు కళ్యాణ్ సుంకర. అసలు ఏం జరిగిందంటే.. డిసంబర్ 31 రాత్రి న్యూఇయర్ సందర్భంగా ఇతడు ఓ ఈవెంట్ ఏర్పాటు చేశాడు.

ఈ ఈవెంట్ కి హీరోయిన్లు వస్తారని ప్రచారం చేసి పెద్ద మొత్తంలో టికెట్లు అమ్మాడు. కానీ ఈవెంట్ లో ఒక్క హీరోయిన్ కూడా కనిపించలేదు. దాంతో కళ్యాణ్ సుంకరపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీలో హీరోయిన్లతో డాన్స్ లు చేయిస్తానని, పార్టీకి వచ్చిన వారితో హీరోయిన్లు క్లోజ్ గా మూవ్ అవుతారని రకరకాలుగా ప్రచారం చేసి టికెట్లు అమ్ముడయ్యేలా చేశాడు.

హీరోయిన్లు వస్తారని భావించిన కొందరు వారు కనిపించకపోయేసరికి నిరాశ చెందారు. అలా అని ఊరుకోలేదు.. కళ్యాణ్ సుంకర తమను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జనవరి 1న పోలీసులుకళ్యాణ్ సుంకరని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ మీద కళ్యాణ్ సుంకరని జైలుకి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్